ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా రెండో రోజూ వైభవంగా సాగుతోంది.. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా. యమునా. సరస్వతి నదుల సంగమ ప్రాంతం జన సంద్రంలా మారిపోయింది.. దేశవిదేశాల నుంచి భక్తులు. సాధువులు తరలిస్తున్నారు.. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు 'అమృత్ స్నాన్' చేశారు.. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి. శ్రీశంభు పంచాయతీ అటల్ అఖాడా. నిరంజని అఖాడా. ఆనంద్ అఖాడామకరసంక్రాంతి వేళ తొలి 'అమృత్ స్నాన్' ఆచరించారు.. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాలో పాల్గొంటున్నాయి.. 'పౌష్ పూర్ణిమ' సందర్భంగా సోమవారం ప్రధాన 'స్నానం'నిర్వహించగా మకరసంక్రాంతి రోజు చేసేది అమృత్ స్నానమని అఖాడాలు చెబుతున్నారు.. పెద్ద సంఖ్యలో భక్తులు. సాధువులు. ప్రజలు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తమ పాపాలన్నీ సమసిపోతాయనే విశ్వాసంతోభక్తులు. సాధువులు భారీగా తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు. అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివస్తున్నారు.. గడ్డకట్టించేత చల్లగా నీరు ఉన్నప్పటికీ భక్తులు గుంపులుగా వెళ్లి పుణ్యస్నానాలు చేస్తున్నారు.. 'హర్ హర్ మహాదేవ్'. 'జై శ్రీరామ్'. 'జైగంగామయ్యా'అని నినదిస్తూ స్నానాలు చేస్తున్నారు.. ఉదయం 7 గంటల సమయానికి కోటి మంది దాదాపు కోటి మంది అమృత్ స్నానం ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.. 10వేల ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది.స్నాన్ ఘాట్‌లన్నీ కిక్కిరిసిపోయాయి.. మహా కుంభమేళాకు వస్తున్న నాగుసాధువు. నదిలో ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్న సిబ్బంది. మహా కుంభమేళాకు వచ్చిన అఘోరాలు