TSPSC New Group 1 Notification Released Today Prathidwani :సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠలకు తెర దించుతూ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 503 పోస్టుల పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ 563 పోస్టులతో కొత్త ప్రకటనను టీఎస్పీఎస్సీ వెలువరించింది. మే-జూన్‌లో ప్రిలిమ్స్, సెప్టెంబరు- అక్టోబరులో మెయిన్స్ అని షెడ్యూల్ కూడా వెల్లడించింది. మరిక గ్రూప్స్ పరీక్షలకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లేనా? పాత-కొత్త నోటిఫికేషన్లలో ఎలాంటి మార్పులు చేశారు. టీఎస్పీఎస్సీ ఇచ్చిన సిలబస్ ఎలా ఉంది అందుకు అనుగుణంగా అభ్యర్థుల ప్రిపరేషన్, ప్లానింగ్ ఎలా ఉంటే మేలు? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.
గ్రూప్ -1 పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది - మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? - TSPSC New Group 1 Notification
TSPSC New Group 1 Notification Released Today Prathidwani : సుదీర్ఘ నిరీక్షణ, ఉత్కంఠలకు తెర దించుతూ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. 503 పోస్టుల పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ, 563 పోస్టులతో కొత్త ప్రకటన వెలువరించింది. ఈ అంశాలపైనే నేటి ప్రతిధ్వని.
Published : Feb 21, 2024, 11:06 AM IST
TSPSC Group 1 Notification Cancelled :2022 ఏప్రిల్ 26న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ మళ్లీ పోస్టులు పెంచి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంతకు ముందు 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్‌ను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. కానీ పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ఆ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చింది.
వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో టీఎస్పీఎస్సీ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్న అప్పీలను వెనక్కి తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తితో సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే అంతకు ముందు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 60 పోస్టులను అదనంగా చేర్చింది. ఈ పోస్టులను పాత నోటిఫికేషన్లో కలపాలా లేక వేరే నోటిఫికేషన్ ఇవ్వాలా అనే సందిగ్ధంలో టీఎస్పీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు చేయగానే ఆ పోస్టుల్లో కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్లో పరీక్ష తేదీలు, సిలబస్, ఫీజు వంటివి ఉన్నాయి.