Pratidwani Debate on Stock Market Investments :స్టాక్‌మార్కెట్‌లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వొచ్చా? కొన్ని రోజులుగా దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో నెలకొన్న తీవ్ర ఒడుదొడుకుల మధ్య చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఈ విషయంలో స్టాక్ మార్కెట్ పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు ఏం అంటున్నారు? సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటున్న హిండెన్‌బర్గ్ సంస్థ ప్రకటనను స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ఎలా చూస్తున్నారు?
స్టాక్‌మార్కెట్‌లో గమనించాల్సిన అంశాలేమిటి? :గంటలు, రోజుల వ్యవధిలో లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మార్కెట్ ఊగిసలాటల్లో గమనించాల్సిన విషయాలు ఏమిటి? మొత్తంగా మన మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో స్టాక్ మార్కెట్ నిపుణుడు సూర్యదేవ్ బండారి, పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు హను ఎండ్లూరి పాల్గొన్నారు.
ఒక్క రోజు వ్యవధిలో రూ.15లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంతకుముందు, తర్వాత కూడా తీవ్ర హెచ్చుతగ్గులు చూశాం. పడుతూ లేస్తూ వస్తోన్న స్టాక్‌మార్కెట్‌ల్ని ఇప్పుడు భయపెడుతోన్న మరో అంశం హిండెన్‌బర్గ్ రిపోర్ట్. సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అన్న ఆ సంస్థ ట్వీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో స్టాక్‌మార్కెట్‌లో కొత్తగా రావాలనుకునే వారికి ఇది సరైన సమయమేనా అనే ప్రశ్న చాలా మందిలో వెంటాడుతోంది.
నిపుణలు ఏం చెబుతున్నారంటే? :స్వల్పకాలంలోస్టాక్ మార్కెట్లో ఒడుదొడుకులు సహజం. అందువల్లనే దీర్ఘకాలిక దృష్టితో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. కొంత మంది లాభాలు ఇస్తున్న షేర్లను అమ్మేసి, నష్టాలు వచ్చిన షేర్లను కొంటూ ఉంటారు. భవిష్యత్‌లో వాటి విలువ భారీగా పెరిగిపోతుందని ఆశిస్తూ ఉంటారు. కానీ ఇది సరైన వ్యూహం కాదని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ దీర్ఘకాలిక లక్ష్యంతో మాత్రమే పెట్టుబడులు కొనసాగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీకు కదరకపోతే, క్రమానుగతంగా పెట్టుబడులను కొనసాగించాలి.
మీకు సంతృప్తి అనిపించినప్పుడు మాత్రమే, లాభాలను స్వీకరించాలి. స్టాక్ మార్కెట్లను నిరంతరం వచ్చే ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ స్టాక్ మార్కెట్లు స్పందిస్తుంటాయి. కనుక ఇన్వెస్టర్లు ఎప్పుడూ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ, అడుగులు ముందుకు వేయాలి. అంతే కాదు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎంతో క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం. పెరుగుతుంది.