ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

కొందరు కూటమి నేతల తీరుతో ముసురుకుంటున్న వివాదాలు - PRATIDHWANI ON RULING PARTY MLA

దురుసు వ్యాఖ్యలు, అనవసర పంచాయితీలతో చెడ్డపేరు- ప్రభుత్వ సంకల్పాలకు తలనొప్పిగా కొందరినేతల తీరు

pratidhwani-on-ruling-party-mlas-cross-the-line-of-discipline
pratidhwani-on-ruling-party-mlas-cross-the-line-of-discipline (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 2:15 PM IST

Pratidhwani :కూటమి నేతలు, అదుపు,అదుపు! ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయం ఇది. కారణం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకుల తీరుపై పలుచోట్ల ముసురుకుంటున్న విమర్శలు. ఏ విషయంలోనైతే వైఎస్సార్సీపీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారో, ఇప్పుడు కొందరు అధికారపక్ష నేతలు అదే బాటలో సాగడాన్ని ఎలా చూడాలి? పత్రికలు, మీడియా పైనే బెదిరింపుల్ని ఏమనాలి? ఒకాయన మాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటారు. మరొకాయన వ్యతిరేక వార్తలొస్తే తాట తీస్తా అంటాడు.

అవసరం లేని పంచాయతీల్లో తలదూర్చేవారు, తమకేం పట్టనట్లు చెలరేగిపోయేవారు మరికొందరు. ఎమ్మెల్యేల స్థాయిలోనే ఇలా ఉంటే కిందలెవెల్లో వారికి చెప్పేది ఎవరు? వరస వివాదాలతో వీరంతా ఏం సందేశం ఇస్తున్నారు. ఎలాంటి దిద్దుబాటు అవసరం? ఇదే అంశం నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయనవేదిక కన్వీనర్​ టి. లక్ష్మీనారాయణ.

రాష్ట్రంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రవర్తనపై పలుచోట్ల విమర్శలు ముసురుకుం టున్నాయి. ఏ విషయంలోనైతే వైఎస్సార్సీపీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారో, అదే బాటలో కూటమి నేతలు సాగడాన్ని ఎలా చూడాలి? అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకుండానే వరుసగా ఇన్ని వివాదాలా అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. దీనికి మేరేమంటారు? వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, దౌర్జన్యాలు, దురుసుప్రవర్తన, అధికారులకు బెదిరింపు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇవే పనులను కొంతమంది కూటమి నాయకులు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మీ పరిశీలన ఏంటి?

'నాపై, నా తమ్ముడిపై తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా'
ఇసుక, మద్యం, మైనింగ్, బదిలీలు ఇలాంటి వాటిల్లో ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరించటాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన గుమ్మనూరు జయరామ్‌, తులసిబాబు లాంటి వాళ్లు ఈ ప్రభుత్వంలోనూ చెలరేగిపోతుంటే ప్రజలు ఏమని అనుకోవాల్సి ఉంటుంది?. వివిధ జిల్లాల్లో వైఎస్సార్సీపీ నాయకుల వ్యవహారశైలి వల్లే ఆ ప్రభుత్వం పతనమైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఎంత బాగా పనిచేస్తున్నా కిందిస్థాయి నాయకులను కట్టడి చేయకపోతే ఎటువంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్రుల పేషీల్లో అవినీతిపరులను పెట్టుకోవటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. హోంమంత్రి అనిత పీఏ తొలగింపు ఒక ఉదాహరణ. ఈ విషయంలో ముఖ్యమంత్రి అందరికీ ఎటువంటి మెసేజ్ ఇస్తే బాగుంటుంది?

పాలనను తిరిగి గాడిలో పెట్టడం మంచిదే అయినా, రాజకీయాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పార్టీ నాయకుల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుందన్న విమర్శలపై మీరు ఏం అంటారు? అనే అంశాల గురించిన సమగ్ర సమాచారం ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

'గుడివాడ వస్తే మీ సంగతి చూస్తా' - పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన తులసిబాబు

ABOUT THE AUTHOR

...view details