Harish Kumar Gupta has Take Charge as New DGP: రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల నుంచి ద్వారకా తిరుమలరావు గౌరవ వందనం స్వీకరించారు. సాంప్రదాయం ప్రకారం ద్వారకాతిరుమలరావు దంపతులను పూలతో అలంకరించిన వాహనంపై ఉంచి గౌరవపూర్వకంగా ఉన్నతాధికారులు తాడుతో లాగారు. డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వానికి కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు.
సీఎం 2047 లక్ష్యాన్ని నిర్ధేశించారని ఆ లక్ష్యం నెరవేరడంలో పోలీసు శాఖది కూడా ప్రధాన బాధ్యత అని నూతన డీజీపీ వెల్లడించారు. గడచిన 6 నెలల్లో పోలీసు శాఖ ఎన్నో నిర్ణయాలు తీసుకుందని అన్నారు. టెక్నాలజీ సాయంతో ప్రజలకు మంచి సేవలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెడతామని వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్: నారా లోకేశ్
పోలీసులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టి సంక్షేమానికి కృషి చేస్తానని హరీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే మెరుగైన సేవలు అందించగలుగుతారని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యపోస్టులు పెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా మారిపోయిందని వాటిపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది సైబర్ కమాండర్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు డీజీపీ తెలిపారు.
"డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు 2047 లక్ష్యాన్ని నిర్దేశించారు. గడిచిన 6నెలల్లో పోలీస్‌శాఖ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. టెక్నాలజీతో ప్రజలకు మంచి సేవలు అందిస్తాము. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సైబర్ నేరాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెడతాము. పోలీసులకు మౌలిక వసతులు, సంక్షేమానికి కృషి చేస్తాము. 200మంది సైబర్ కమాండర్లను సిద్ధం చేస్తున్నాము. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెడతాము".- హరీష్‌కుమార్ గుప్తా, డీజీపీ
బాధ్యత చేపట్టిన 24 గంటల్లోనే ఉద్యోగ విరమణ ఎందుకంటే!
నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు - యూనిఫాం ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది : డీజీపీ