ETV Bharat / opinion

'పడిపోతున్న రూపాయి - బలపడుతున్న డాలర్' - అసలు ఎందుకీ పతనం? - HOW RUPEE VALUE FALL

కొంతకాలంగా ఆందోళన కలిగిస్తోన్న రూపాయి విలువ - డాలర్‌తో పోల్చితే జీవితకాల కనిష్ఠానికి రూపాయి పతనం - చూస్తుండగానే 86 రూపాయలు దాటేసిన మారక విలువ

Pratidhwani On How Indian Rupee Value Fall Compared To Us Dollar
Pratidhwani On How Indian Rupee Value Fall Compared To Us Dollar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 6:47 PM IST

Pratidhwani On How Indian Rupee Value Fall Compared To Us Dollar : రూపాయి భయపెడుతోంది. డాలర్‌తో దాని మారకవిలువ ఆందోళన కలిగిస్తోంది. అదిగో ఇదిగో అంటునే 86 రూపాయలు దాటేసింది. అసలు ఎందుకీ పతనం? రూపాయి పతనం దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ఇదేదో ఆర్థిక రంగానికి సంబంధించిన వారికే కాదు ప్రతిఒక్కరు దృష్టి పెట్టాల్సిన విషయం. సగటు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎంతకాలం? రూపాయి ఎప్పటికి కోలుకుంటుంది? అంతలోపు విదేశీవిద్య మొదలు అమెరికా, ప్రపంచ దేశాలపై ఆధారపడి చేసే ఖర్చుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గడం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రతికూలమేనా? రూపాయిని కాపాడుకోవడం కేంద్రప్రభుత్వం ముందున్న మార్గమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు 1. వీవీకే ప్రసాద్ (వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, హైదరాబాద్) 2. ప్రొ. చిట్టెడి కృష్ణారెడ్డి (హెచ్‌సీయూ ఆర్థికశాస్త్ర విభాగం, హైదరాబాద్‌)

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓ వైపు రూపాయి విలువ పడిపోతుంటే మరోవైపు డాలర్ బలపడుతొందని తెలిపారు. కొంతకాలంగా ఆందోళన కలిగిస్తోన్న రూపాయి విలువ, ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే జీవితకాల కనిష్ఠ పతనానికి చేరిందన్నారు. చూస్తుండగానే మారక విలువ 86 రూపాయలు దాటేసిందన్నారు. అసలు రూపాయి ఈ స్థాయిలో ఎందుకు పతనమవుతోందని అందరిలో ప్రధాన చర్చగా ఉందన్నారు. ఈ రూపాయి క్షీణత అనేది దేశంలోని అనేకరంగాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపారు. 2024 డిసెంబర్‌లో డాలర్‌తో పోలీస్తే రుపాయి మారక విలువ రూ.85 ఉంది. అయితే 2024 మొత్తం మీద రూపాయి విలువ 3% వరకు క్షీణించిందని తెలిపారు.

'కొత్త బడ్జెట్‌ - కోటి ఆశలు' - ఆ వేతనజీవుడికి ఇప్పుడైనా ఉపశమనం దొరికేనా?

దీంతో దిగుమతి భారం పెరిగి ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదం ఉందన్నారు. డాలర్ విలువ పెరుగుదలతో ఉద్యోగిత రేటులో అంచనాలకు మించి అమెరికా రాణిస్తొంది.
అలాగే అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపును ఆలస్యం చేస్తూ వస్తొందన్నారు. దీంతో వడ్డీరేట్ల తగ్గింపు లేకపోవచ్చనే అంచనాలతో అమెరికా డాలర్ ఉరకలు వేస్తోందన్నారు.
ప్రస్తుతం రూపాయి కష్టాలు ఎప్పటికి తీరతాయనే ఆర్ధికవేత్తలందరి బెంగన్నారు.

డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎందుకు క్షీణిస్తోంది? ఈ పతనం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలపై ఎలా ఉందనేది ముందున్న సవాల్ అన్నారు. అలాగే భారత కరెన్సీ వాల్యూ పడిపోవడం అనేది మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది? అందర్ని కలవర పెడుతోందన్నారు. దీంతో డాలర్‌కు ప్రత్యమ్నాయ కరెన్సీ రావాలన్న ప్రతిపాదన వచ్చిందన్నారు. ఒకవైపు రూపాయి మారకం విలువను కాపాడుకోవడం, మరోవైపు పెరిగిన డాలర్ ప్రభావం దేశీయంగా ప్రజలపై పడకుండా చూడటమే ప్రస్తుతం కేంద్రం ముందున్న సవాల్ అన్నారు.

5 ఏళ్లు చీకట్లో మగ్గిన రాష్ట్రానికి మళ్లీ శుభసూచికలు-దావోస్ నుంచి ఏపీకి పెట్టుబడుల బాట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.