Pratidhwani : ఎప్పట్నుంచో చర్చలో నడుస్తున్న ఉమ్మడి పౌరస్మృతి విషయంలో తొలి అడుగు వేసింది ఉత్తరాఖండ్ రాష్ట్రం. యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. మరి ఆ చట్టం ద్వారా అక్కడ వచ్చిన మార్పులు ఏమిటి? జాతీయస్థాయిలో తీసుకుని రావాలని ప్రతిపాదనల్లో ఉన్న యూసీసీలో ఎన్నింటికి చోటు దక్కింది? బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న ఉత్తరాఖండ్‌లో తీసుకున్న ఈ విప్లవాత్మకంగా నిర్ణయం దేశం మొత్తం అదే తరహా చట్టం అమలుకు ట్రయల్ రన్ అనుకోవచ్చా? ఉమ్మడి పౌరస్మృతి వస్తే కుటుంబ న్యాయ చట్టాలు ఎలా మారతాయి? ఆ దిశగా కేంద్రం దాటాల్సిన రాజకీయ, రాజ్యాంగపరమైన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నే ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ పాత్రికేయులు డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల సహాయ ఆచార్యులు పీవీఎస్ శైలజ.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమల్లోకి తీసుకుని రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పుష్కర్‌సింగ్ ధామి ప్రభుత్వం తీసుకుని వచ్చిన యూసీసీ చట్టంలోని ముఖ్యాంశాలు ఏమిటి? దాని ప్రకారం అక్కడ కుటుంబ న్యాయ పాలన ఎలా మారనుంది? బీజేపీ ఉత్తరాఖండ్‌లో తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం దేశం మొత్తం అదే తరహా చట్టం అమలుకు ట్రయల్ రన్ అనుకోవచ్చా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం దేశంలోని పౌరుల భద్రత కోసం ఒకే విధివిధానాలు అమలు చేసే అధికారం ఉందని అంటున్నారు. అందులో ఫ్యామిలీ లా కూడా ఉంటుందా?
UCCని అమలు చేసిన ఉత్తరాఖండ్- దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్!
అసలు భిన్నమతాలు, భిన్న సంస్కృతీ, సంప్రదాయాలున్న మన దేశంలో వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి హక్కులకు ఒకేచట్టం ఆచరణ సాధ్యమేనా? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశం మొత్తం కూడా ఇలానే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకుని రావాలని అడుగు ముందుకు వేస్తే ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? రాజ్యాంగపరంగా ఏం చేయాలి? ఉత్తరాఖండ్ చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా?
కామన్ సివిల్ కోడ్ యూనిఫైడ్ సివిల్ కోడ్ ఈ రెండు పదాల మధ్య ఏమైనా తేడా ఉందా కాలక్రమంలో నాయకుల నోట ఈ మాటలో మార్పులు ఎందుకు వచ్చింది?ఒకవేళ జాతీయస్థాయిలో వీలుకాకుంటే.. ఉత్తరాఖండ్ తరహాలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇలా ప్రత్యేకచట్టం చేసుకుని ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకుని రావొచ్చా? ఇటువంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.
2029 వరకు మోదీయే ప్రధాని- ఆ తర్వాత కూడా ఆయనే!: అమిత్ షా - Lok Sabha Elections 2024