ETV Bharat / state

ఆశపడ్డారు - తెల్లకాగితాలు చూసి తెల్లబోయారు - FAKE CURRENCY CASE IN MANGALAGIRI

రూ.15 లక్షలు ఇస్తే రూ.30 లక్షలు - సూట్​కేసులో తెల్లకాగితాలు - మోసపోయిన దంపతులు

FAKE CURRENCY IN MANGALAGIRI
FAKE CURRENCY IN MANGALAGIRI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 7:02 PM IST

Fake Currency Case In Guntur District: నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కొద్దిమంది కష్టపడితే, మరికొద్దిమంది మాత్రం అడ్డదారులు తొక్కుతారు. అలాంటి ఘటనే మంగళగిరిలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మంగళగిరి టోల్​ప్లాజా దగ్గరకు ఓ భార్యాభర్తల జంట వచ్చింది. వాళ్లు తెచ్చిన డబ్బులు ఓ వ్యక్తికి ఇచ్చారు. అతను వాళ్లకు సూట్​కేసు ఇచ్చాడు. అంతే వెంటనే అతను పోలీసులు వస్తున్నారు, పారిపోండి అని చెప్పాడు. కంగారుపడ్డ ఆ భార్యాభర్తలు అక్కడినుంచి పారిపోయారు. కొద్దిసేపు తర్వాత సూట్​కేసు తెరిచిన దంపతులు అవాక్కయ్యారు. తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

అసలేమైందంటే: గుంటూరు జిల్లా పేరేచర్లలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి తిరుచానూరులోని ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో నకిలీ నోట్ల గురించి చెప్పాడు. ఎవరైనా రూ. 15 లక్షలు ఇస్తే వారికి రూ. 30 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని ఆశ చూపించారు. అందుకు తిరుచానూరులోని పగడాల జ్యోతి దంపతులు ఆశపడి మధ్యవర్తి ద్వారా అతన్ని సంప్రదించారు. జనవరి 31 తెల్లవారుజామున మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్దకు వస్తే నకిలీ డబ్బులు ఇస్తానని చెప్పడంతో తిరుచానూరు నుంచి వారు ఇక్కడికి చేరుకున్నారు.

తరువాత తిరుచానూరు నుంచి దంపతులు తెచ్చిన అసలు నోట్లు తీసుకొని బదులుగా నకిలీ నోట్లు ఇచ్చాడు. అంతలోనే పోలీసులు వస్తున్నారని హడావిడి చేసి వారిని అక్కడ నుంచి పంపించి వేశాడు. పక్కకు వచ్చి డబ్బులు చూసుకుని వారు షాక్​కు గురయ్యారు. సూట్​కేసులో ఉన్నవన్నీ తెల్లకాగితాలని అర్ధమైంది. దాంతో బాధితులు మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు.

"తిరుచానూరు నుంచి దంపతులు తెచ్చిన అసలు నోట్లు తీసుకొని బదులుగా నకిలీ నోట్లు ఇచ్చి పోలీసులు వస్తున్నారని హడావిడి చేసి వారిని అక్కడ నుంచి నిందితుడు పంపించేశాడు. పక్కకు వచ్చి వారు డబ్బులు చూసుకునే సరికి వారికి అవి నకిలీవి కావని తెల్లకాగితాలని వారికి అర్ధమైంది. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడా కూడా ఇటువంటి మోసాలకు గురి కాకుండా తెలివిగా వ్యవహరించాలని ప్రజలందరినీ కోరుతున్నాం". -శ్రీనివాసరావు, సీఐ, మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్

దొంగ నోట్ల ముఠా అరెస్ట్- రూ.10లక్షలకు రూ.44 లక్షల నకిలీ కరెన్సీ

లిక్విడ్​లో ముంచితే ఒరిజినల్​ - రూ.30 లక్షలకు మూడు కోట్లు - ఇద్దరు అరెస్ట్​

నకిలీ నోట్ల కలకలం- రూ.500 దొంగనోట్లతో మద్యం కొనుగోలు చేస్తూ పట్టుబడిన వైసీపీ కార్యకర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.