ETV Bharat / opinion

'కొత్త బడ్జెట్‌ - కోటి ఆశలు' - ఆ వేతనజీవుడికి ఇప్పుడైనా ఉపశమనం దొరికేనా? - UNION BUDGET 2025 26 EXPECTATIONS

మరికొన్ని రోజుల్లో రానున్న కేంద్ర నూతన బడ్జెట్ - 2025-26 ఆర్థిక సంవత్సరం పద్దుపై ముమ్మర కసరత్తు - బడ్జెట్‌తో వేతనజీవుల అంచనాలు ఎదురుచూపులు

Union Budget 2025-26 Expectations
Union Budget 2025-26 Expectations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 2:00 PM IST

Union Budget 2025-26 Expectations : మరికొన్ని రోజుల్లోనే దేశానికి కొత్త బడ్జెట్ రాబోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్తపద్దు ప్రవేశ పెట్టేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాల ప్రతినిధులు ఆయా సంఘాలు, మండళ్లతో సంప్రదింపులు కూడా గట్టిగానే చేశారు. ఐతే ఆ ప్రక్రియలో ఎక్కడా చోటు దక్కని రానున్న బడ్జెట్‌తో అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే వ్యక్తి మరొకరు ఉన్నారు. ఊపిరి బిగబట్టి ఈసారైనా తనకు ఊరట కల్పించమని వేడుకుంటున్నాడు. మరి దేశంలో కోట్లాదిమంది బడ్జెట్‌ పద్మనాభాల ప్రతినిధి సగటు వేతనజీవుడి బడ్జెట్ అశలు అంచనాలు ఎలా ఉన్నాయి? ఈసారైనా తను కోరుకునే ఊరట, మినహాయింపుల్లో ఉపశమనం లభిస్తుందా? కేంద్రం ఆలోచనలు ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు 1. డా. ఎస్.అనంత్ (ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు, విజయవాడ) ‌2‌. చలమల రేవంత్‌ (సర్టిఫైడ్ వెల్త్‌మేనేజర్, హైదరాబాద్)

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మరికొన్ని రోజుల్లో రానున్న కేంద్రబడ్జెట్‌ 2025-26పై వేతనజీవులు, మధ్యతరగతి వారు భారీగా అంచనాలు పెట్టుకున్నారని తెలిపారు. నేరుగా ఆదాయపన్ను కాకుండా పరోక్షంగా వేతనజీవులకు 80సీ, 80డీ వంటివాటి కింద ఉన్న మినహాయింపులపై ఆశలు ఉన్నాయన్నారు. నిజానికి నూతన ఆదాయపన్ను చట్టం ప్రవేశ పెడతామన్న మాట చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈసారైనా అది వస్తుందా? అనేది వేచి చూడాలన్నారు.

అసలే పెరిగిన ఖర్చులతో బాధపడుతుంటే కొద్దోగొప్పో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దానిపై కూడా పన్నులు బాదుతున్నారు. ఈ విషయంలో పునరాలోచన చేస్తే బావుంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం, పెరిగిన వడ్డీరేట్ల ఫలితంగా జీవన వ్యయాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? నిజ ఆదాయాలపై ఆ ప్రభావాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోందా? అనేది చూడాలన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో విద్యా, వైద్యం, గృహరుణాలపై మినహాయింపులు ఎలా పెరగాలి? అనేది చూడాలన్నారు. మొత్తంగా ఈ రోజు ఉన్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆదాయపన్ను లో ఎన్ని శ్లాబులుండాలి? అవి ఎలా ఉండాలి? అనేవి విశ్లేషించుకోవాలన్నారు.

పిల్లలకు డిజిటల్ మంచి, మర్యాద నేర్పిస్తున్నారా?

5 ఏళ్లు చీకట్లో మగ్గిన రాష్ట్రానికి మళ్లీ శుభసూచికలు-దావోస్ నుంచి ఏపీకి పెట్టుబడుల బాట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.