ETV Bharat / state

రైలు పట్టాలపై యువకుడి అనుమానాస్పద మృతి - YSRCP మాజీ ఎమ్మెల్యే సోదరులపై కుటుంబ సభ్యుల అనుమానం - YOUNG MAN SUSPICIOUS DEATH

రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - మహేష్ రెడ్డిని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పెట్టారన్న కుటుంబసభ్యులు

YOUNG MAN SUSPICIOUS DEATH
YOUNG MAN SUSPICIOUS DEATH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 6:43 PM IST

Updated : Jan 26, 2025, 7:42 PM IST

Young Man Suspicious Death: అనంతపురం జిల్లా తాటిచెర్ల సమీపంలో రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాటిచెర్ల గ్రామానికి చెందిన యువకుడు తోపుదుర్తి మహేష్ రెడ్డికి రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులైన రాజశేఖర్ రెడ్డి, చంద్రరెడ్డితో విభేదాలు ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో తనను వైఎస్సార్సీపీ నాయకులు ఇబ్బంది పెట్టినట్లు తన ఫేస్​బుక్ ఖాతాలో తోపుదుర్తి మహేష్ పోస్టు చేశారు.

వారం రోజుల క్రితం తోపుదుర్తి మహేష్ రెడ్డి టీడీపీ నేత పరిటాల శ్రీరామును కలిశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరుడు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తోపుదుర్తి మహేశ్ రెడ్డి ఫేస్​బుక్​లో 16వ తేదీన పోస్టు చేశారు. శనివారం రాత్రి తన మిత్రులతో కలిసి బయటకు వెళ్లిన తోపుదుర్తి మహేష్ రెడ్డి, ఆదివారం ఉదయం రైలు పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ రెడ్డి మృతి పట్ల అనుమానం ఉందని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు.

తమకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబసభ్యులపై అనుమానం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు మహేష్ రెడ్డిని తీవ్ర ఇబ్బందులు పెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. మహేష్ రెడ్డి మృతి పట్ల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

"నాకు ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పాడు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి చంపుతామని అంటున్నారు అని అన్నాడు. ఏం కాదులేరా అని చెప్పాను. మాకు పెద్దగా గొడవలు ఏం లేవు. మా కొడుకుని చాలా చిత్రహింసలు పెట్టారు. గతంలో పోలీసులతో కొట్టించారు. మా కొడుకు ఆత్మహత్య చేసుకోడు. వారిపై మాకు అనుమానంగా ఉంది. మాకు న్యాయం చేయాలి". - మల్లారెడ్డి, మృతుడి తండ్రి

Paritala Sriram Comments: తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్​ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. మహేష్ రెడ్డి తల్లిదండ్రులను పరిటాల శ్రీరామ్ ఓదార్చారు. 2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి తనను కలిశాడని, అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారన్నారు. వారి భూములు విషయంలో లేని సమస్యలు సృష్టించి ఇబ్బందులు పెట్టారన్నారు. అక్రమంగా కేసులు పెట్టి చాలాసార్లు కొట్టారన్నారు. తన పేరు చెప్పాలని ఎన్ని సార్లు ఒత్తిడి తెచ్చినా మహేష్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డారన్నారు. గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు బెదిరింపులకు దిగాడన్నారు. ఇందుకు ఫేస్​బుక్​లో ఉన్న పోస్టులే సాక్ష్యం అన్నారు. పోలీసులు దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.

స్కూల్​కు వెళ్తుండగా ఆటో బోల్తా - పదో తరగతి విద్యార్థిని మృతి

పాపం దొంగ! గది అనుకొని లిఫ్ట్‌ తలుపులు తీశాడు - చివరికి ?

Last Updated : Jan 26, 2025, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.