ETV Bharat / opinion

ఒకరిని మించి ఒకరు ఉచితాలు - వాగ్దానాల ప్రకటనతో హోరాహోరీ - PRATIDHWANI ON DELHI ELECTIONS

త్రిముఖపోరు హస్తినలో గెలిచేదెవరు? - ఫిబ్రవరి 5న జరగబోతున్న దిల్లీ ఎన్నికలు - పోటాపోటీ అంటున్న ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్

pratidhwani
pratidhwani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 1:57 PM IST

Pratidhwani : త్రిముఖ పోరులో హస్తిన గెలిచేది ఎవరు? ఫిబ్రవరి 5న జరగబోతున్న ఎన్నికల సమరానికి సంబంధించి సమీకరణాలు ఎలా ఉన్నాయి? అధికార ఆమ్‌ ఆద్మీ విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒకరిని మించి ఒకరు ఉచితాలు, వాగ్దానాలు ప్రకటిస్తున్నారు. మాటలతూటాలు ఎక్కుపెడుతున్నారు.

కొత్త కొత్త పంథాల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయినా ఓటరు నాడి పార్టీలకు చిక్కుతోందా? పార్టీల విధానాలు, నినాదాలు, ప్రచార సరళులు, ప్రజల స్పందనపై రాజకీయ నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు జాతీయరాజకీయాలపై వ్యాసకర్త చలసాని నరేంద్ర, సీనియర్ పాత్రికేయులు దామోదర్ ప్రసాద్.

దిల్లీ ఎన్నికల్లో ఒకరిని మించి ఒకరు ఉచితాలు, వాగ్దానాలు ప్రకటిస్తున్నారు. మీ పరిశీలనలో దిల్లీ ఎన్నికల తాజా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? దేశం మొత్తాన్ని జయించాలనే కాంక్షతో అనేక రాష్ట్రాల్లో విస్తరించిన బీజేపీకి దిల్లీ ఎందుకు కొరకరాని కొయ్యగా తయారైంది? బలమైన స్థానిక నాయకత్వం లేకపోవటమే కారణమా? గడిచిన ఆరు అసెంబ్లీ ఎన్నికలలో దిల్లీలో ఒక్కసారి కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోలేదు. మోదీ కూడా ప్రతిష్ఠగా తీసుకున్నా బీజేపీ నెగ్గలేకపోయింది. ఈసారి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి?

విద్యార్థులకు ఫ్రీ బస్- సగం ధరకే మెట్రో టికెట్​ - '15 గ్యారంటీ'లతో ఆప్​ మేనిఫెస్టో రిలీజ్

లోక్‌సభ ఎన్నికలలో కలిసి పనిచేసిన ఆప్, కాంగ్రెస్ ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా? దిల్లీ ఓటర్ల తీర్పును విశ్లేషిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు జై కొడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జై అంటున్నారు. ఒకే ఓటర్లు రెండు వేర్వేరు తీర్పులు ఇవ్వటానికి కారణం ఏంటి? లిక్కర్ స్కామ్ అంశం ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపించవచ్చు? బీజేపీ, ఆప్‌లపై దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే పరిస్థితి ఎలా ఉండవచ్చు? దిల్లీ ఎన్నికల ప్రభావం దేశ రాజకీయాలపై ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? అనే పలు అంశాలపై గురించిన సమగ్ర సమాచారం ఈ ప్రతిధ్వని రార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

దిల్లీలో BJP కొత్త స్కెచ్! ఎన్నడూ లేనన్ని హామీలు - అధికారమే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.