ETV Bharat / state

రెచ్చిపోయిన హిజ్రాలు - డబ్బులు ఇవ్వలేదని నడి రోడ్డుపై ఆటో డ్రైవర్‌పై దాడి - HIJRAS ATTACK ON AUTO DRIVER

అనంతపురం జిల్లాలో రెచ్చిపోయిన హిజ్రాలు - డబ్బులు ఇవ్వనందుకు ఓ ఆటో డ్రైవర్​ను కిందపడేసి కర్రలతో దాడి

Hijras Attack on Auto Driver in Bukkarayasamudram Of Anantapur District
Hijras Attack on Auto Driver in Bukkarayasamudram Of Anantapur District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 10:41 PM IST

Hijras Attack on Auto Driver in Bukkarayasamudram Of Anantapur District : అనంతపురం జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోయారు. డబ్బులు ఇవ్వనందుకు ఓ ఆటో డ్రైవర్​పై హిజ్రాలు దాడి చేసి చితకబాదారు. బుక్కరాయసముద్రం ఎన్టీఆర్ పార్కు దగ్గర ఉన్న రహదారిపై హిజ్రాలు వాహనాలను ఆపి బిక్షాటన చేస్తుంటారు. ఈ క్రమంలోనే బత్తలపల్లికి చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆ దారిలో వచ్చాడు. అతడు డబ్బులు ఇవ్వక పోవడంతో హిజ్రాలు అతనితో వాగ్వాదానికి దిగారు. అనంతరం హిజ్రాలంతా కలిసి అతన్ని కిందపడేసి కర్రలతో దాడిచేసి పిడి గుద్దులు కురిపించారు.

భయాందోళనకు గురైన స్థానికులు హిజ్రాలను, ఆటో డ్రైవర్​ను అక్కడి నుంచి పంపించేశారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య మాల్లో వైరల్​గా మారింది. చెరువు కట్ట రహదారిపై హిజ్రాల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి వాహనదారులపై దాడులు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హిజ్రా రౌడీయిజం చేస్తోందని తోటి హిజ్రాల ఫిర్యాదు

హిజ్రా గ్రూపుల మధ్య ఘర్షణ - పరస్పరం రాళ్ల దాడులతో బెంబేలెత్తిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.