వన మహోత్సవం - 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు - Pratidhwani On Van Mahotsav 2024 - PRATIDHWANI ON VAN MAHOTSAV 2024
Prathidwani Debate On VAN MAHOTSAV 2024 : మానవాళికి ప్రాణావాయువును ప్రసాదిస్తున్నాయి చెట్లు. రోజురోజుకు పెరుగుతున్న పారిశ్రామికీకరణ కారణంగా పర్యావరణానికి కూడా కొంత నష్టం వాటిళ్లుతోంది. ఫలితంగా జీవ జంతుజాలంపై ఫ్రతికూల ప్రభావం పడుతుంది. వాతావరణంలో ఆక్సీజన్ స్థాయి పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చు. ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాటిన మొక్కల పెంపకం కోసం ఎలాంటి సంరక్షణ పద్ధతులు పాటించాలనేదానిపై నేటి ప్రతిధ్వని?
Published : Jul 12, 2024, 12:36 PM IST
Prathidwani Debate On VAN MAHOTSAV 2024 : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నగరాలు, గ్రామీణప్రాంతాల్లో పచ్చదనం పరచుకుంటే జీవ వైవిధ్యంలో సమతుల్యత సాధించవచ్చు. పట్టణీకరణ, పరిశ్రమల కాలుష్యం కారణంగా దెబ్బ తింటున్న పర్యావరణానికి రక్షణకవచం ఏర్పడుతుంది. వాతావరణంలో ఆక్సీజన్ స్థాయి పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చు? ఇలాంటి విస్తృత ప్రయోజనాల కోసం ఏటా ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యాచరణ ఏమిటి? నర్సరీల్లో ఎలాంటి మొక్కలు సిద్ధం చేశారు? నాటిన మొక్కల పెంపకం కోసం ఎలాంటి సంరక్షణ పద్ధతులు పాటించాలి? ఇదే నేటి ప్రతిధ్వని.