Pratidhwani Debate On Union Budget 2025-26 : భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్డీయే 3.0 కొత్త బడ్జెట్ ఎలా ఉంది.? 50 లక్షల 65 వేల 34 5కోట్ల రూపాయలతో వచ్చిన నిర్మలాసీతారామన్ పద్దులో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు? ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయితే పొదుపు పెంచే పెట్టుబడులు తెచ్చే మా మంచి బడ్జెట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆర్థికమంత్రి మాట్లాడుతూ కూడా ఖర్చు చేసే ప్రతి రూపాయిపై అత్యంత వివేకంతో ఆలోచించాం ఆర్ధికవ్యవస్థ ప్రతిఅంశాన్ని టచ్ చేసిన బడ్జెట్ కితాబు ఇచ్చుకున్నారు. మరి బడ్జెట్‌లో ఏం ఉంది? పన్ను ఊరటలు, ప్రత్యేక మిషన్‌లు, కొత్తపథకాలు, వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏం చెబుతున్నాయి? నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
భారీ అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ - ఎవరికి ఏమిచ్చారు? - PRATIDHWANI DEBATE ON UNION BUDGET
భారీ అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ విడుదల - 50 లక్షల 65 వేల 34 5కోట్ల రూపాయలతో బడ్జెట్ - దీంట్లో ఎవరికి ఏమిచ్చారు.? నేటి ప్రతిధ్వని.
Published : Feb 2, 2025, 11:07 AM IST
|Updated : Feb 2, 2025, 11:13 AM IST
కేటాయింపుల్లో తెలంగాణకు :కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన పథకాలు, కేటాయింపులు ఏమీ దక్కలేదు. బిహార్, అస్సాం, అండమాన్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లకు మినహా ఏ రాష్ట్రానికి నేరుగా ఎలాంటి కేటాయింపులు, ప్రాజెక్టులు ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజక్టులకు ఆయా శాఖల ద్వారా కేటాయింపులు చేశారు. ఐఐటి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలు, ఎయిమ్స్ వంటి వాటికి గతంలో నేరుగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా ఈ ఏడాది ఆయా శాఖల ద్వారానే అవసరమైన నిధులు అందించనున్నారు.