తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మోయలేని భారంగా మారిన ప్రైవేట్ చదువులు - ఫీజుల నియంత్రణ ఎలా ? - Private Schools Fee Increased in Telangana - PRIVATE SCHOOLS FEE INCREASED IN TELANGANA

Telanagana Private Schools Fee Increased : విద్యా సంవత్సరం ప్రారంభంతో విద్యార్థులు పాఠశాలల్లో చేరుతున్నారు. పిల్లల్ని ప్రైవేటు స్కూల్స్‌కు పంపేందుకు పేరెంట్స్ ఇష్టపడుతున్నారు. వారి నమ్మకాన్ని అవకాశంగా మలుచుకుంటున్న ప్రైవేట్‌ పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరి దిశగా ప్రభుత్వం ఎప్పుడు అడుగులేస్తుంది? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

Private Schools Fee Increased in Telangana
Private Schools Fee Increased in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 10:16 AM IST

Prathidhwani on Private Schools Fees Increased : పోటీపరీక్షల్లో నెగ్గుకురావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో చదవాలన్న భావన వల్ల తల్లిదండ్రులు ప్రైవేట్ చదువులపై మొగ్గుచూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేసిన డబ్బంతా పిల్లల ఫీజుల కోసం ఖర్చు చేస్తున్నారు. ప్లే స్కూల్స్‌, టెక్నో, ఇంటర్నేషనల్, ఈ-టెక్నో, ఒలింపియాడ్ వంటి పేర్లతో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

పేరెంట్స్‌ నమ్మకాన్ని అవి అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. అసలు తెలంగాణలో పాఠశాలల్లో ఫీజుల నిర్ణయం ఎలా జరుగుతోంది? రాష్ట్రంలో ఫీజుల నియంత్రణపై వేసిన గత కమిటీలు ఏం చెప్పాయి? బడుల్లో ఫీజులపై విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది?. స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ప్రైవేట్, కార్పొరేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల ఫీజులు పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు భరించగలిగే స్థాయిలో ఉన్నాయా? ఫీజులపై చట్టం తయారీ దిశగా ప్రభుత్వం ఎప్పుడు అడుగులేస్తుంది? ఇదే నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details