ఆన్‌లైన్ బెట్టింగులతో జీవితాలు ఆగమాగం - బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై తీసుకుంటున్న చర్యలేంటి? - online betting games and apps - ONLINE BETTING GAMES AND APPS
Prathidwani Debate on Online Betting : ఆన్‌లైన్ జూదానికి అడ్డాగా మారుతున్న సెల్‌ఫోన్ టెక్నాలజీ. మనీ గేమ్స్, బెట్టింగ్‌లకు నెటిజన్లు స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. దీనికి బానిసలై అప్పుల్లో చిక్కుకుంటున్నారు. మరీ మనీ గేమ్స్, బెట్టింగ్ బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి నేరాలు చేసే వారికి న్యాయస్థానం ఎలాంటి శిక్షలు వేస్తుంది? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.
Published : Apr 11, 2024, 9:26 AM IST
Prathidwani Debate on Online Betting : మెరుగైన సమాచార సంబంధాల కోసం ఉపయోగించాల్సిన సెల్‌ఫోన్ ఆన్‌లైన్ జూదానికి అడ్డాగా మారుతోంది. అంతర్జాలంలో వైజ్ఞానిక విషయాలు వెతికిపట్టేందుకు వాడాల్సిన స్మార్ట్‌ఫోన్‌ను బెట్టింగ్‌లు, మనీ గేమ్స్ ఆడేందుకు వాడుతున్నారు కొందరు నెటిజన్లు. ఇలాంటి వ్యసనాల ఊబిలోకి దిగి బయటపడలేని నిస్సహాయులు ప్రాణాలు తీసుకుంటున్నారు. సరదా కోసం మొదలుపెట్టిన ఆన్‌లైన్ ఆటలు ఎందుకు వ్యసనాలుగా మారుతున్నాయి? మనీ గేమ్స్, బెట్టింగ్ యాప్స్‌కు చట్టబద్ధత ఉందా? యువత విలువైన సమయాన్ని, ప్రాణాల్ని హరిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అడ్డుకట్ట వేసేదెలా? ఇదే నేటి ప్రతిధ్వని.