జల సంరక్షణపై బాధ్యత గుర్తు చేసిన హైకోర్టు - ప్రభుత్వం ఏ విధమైనా చర్యలు తీసుకోవాలి?
Prathidhwani Debate on Water Issue : రాష్ట్రంలో జల సంరక్షణపై ప్రభుత్వానికి మరోసారి బాధ్యతను గుర్తు చేసింది హైకోర్టు. నీటి ముప్పు ముంచుకొస్తోందని ఇప్పటి నుంచే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. మరి జల సంరక్షణ కోసం సర్కార్ ఏ విధమైనా చర్యలు తీసుకోవాలి? అదే విధంగా ప్రజల బాధ్యత ఏంటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.
Published : Mar 15, 2024, 9:40 AM IST
Prathidhwani Debate on Water Issue : జల సంరక్షణపై మరోసారి ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. ఇంకుడు గుంతలు, అదేవిధంగా జల సంరక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని సూటిగా స్పష్టం చేసింది. ఇప్పటికైనా మేల్కొకోక పోతే నీటి కష్టాల విషయంలో హైదరాబాద్ బెంగళూరులా మారిపోతుందని హెచ్చరించింది. నీటి గుంటలు, బోర్ల విషయంలో చట్టాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. అసలు హైకోర్టు ఇంత ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది? జల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏ విధమైనా చర్యలు తీసుకోవాలి? అదే విధంగా ప్రజల బాధ్యత ఏంటి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.