Prathidhwani Debate On Cyber Frauds: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్తపంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాధునికమైన సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ప్రజల ఖాతాల్లో డబ్బును కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్నా రాష్ట్రంలో ఏదో ఓ చోట సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులను పోగొట్టుకుంటున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు - హైటెక్ చీటింగ్‌కు అడ్డుకట్ట వేసేదెలా? - Cyber Crime Cases in Telangana - CYBER CRIME CASES IN TELANGANA
Cyber Frauds In Telangana : ఇటీవలి కాలంలో సైబర్ నేరాల బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేటుగాళ్లు సరికొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతుండడంతో అమాయకులకు తిప్పలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉంది? పెరుగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట ఎలా వేయాలి? ఇదే నేటి ప్రతిధ్వని.
Published : May 7, 2024, 10:00 AM IST
|Updated : May 7, 2024, 12:25 PM IST
Cyber Crime Cases In Telangana : అధికాదాయ వర్గాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా నేరస్తులు నెటిజన్లకు వల విసురుతున్నారు. ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు, పిగ్ బచరింగ్ వంటి పద్ధతుల ద్వారా ప్రజల్ని డిజిటల్ ఫ్రాడ్స్ ఉచ్చులోకి లాగుతున్నాయి సైబర్ ముఠాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉంది? పెరుగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట ఎలా వేయాలి? వ్యక్తిగతంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే నేటి ప్రతిధ్వని.