Prathidhwani: ప్రపంచంలో ఎక్కడైనా ఒక వస్తువును ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారే దాని ధర నిర్ణయిస్తారు. ఒక్క రైతు తప్ప. తాను పండించే పంటకు ధరను తాను నిర్ణయించలేని నిస్సహాయత అన్నదాతది. ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టిని తట్టుకుంటూ అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి మన ఆకలి తీరుస్తున్నాడు. ప్రపంచంలో ఏ వృత్తిలోనూ లేనన్ని బలవన్మరణాలు కేవలం వ్యవసాయ రంగంలోనే మనకి కనిపిస్తాయి. దానికి కారణం మన కడుపు నింపుతూ తాను పస్తులు ఉండటమే.
ఆరుకాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తుంటే అకాల వర్షాల వల్ల పంటలు పాడైపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలలో వర్షానికి వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. ప్రకృతి పగబడితే ఆ తప్పు రైతులదా? ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజం మీద లేదా? ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రయినా పొలంలోనే ఉంటూ, అక్కడే తింటూ సమాజం కోసం శ్రమిస్తున్న కర్షకుల కష్టానికి ఫలితం ఎందుకు దక్కట్లేదు? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు పి.జమలయ్య తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ పాల్గొంటున్నారు.
తీవ్ర నిరాశ మిగిల్చిన మామిడి సాగు - ధరలను నియంత్రిస్తూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు - Mango Farmers problems
CM Jagan Neglect Tenant Farmers : సీఎం జగన్ అధికారంలోకి వచ్చిది మొదలు కౌలు రైతుకు అన్నీ కష్టాలే. రాయితీ పథకాలు లేవు. పెట్టుబడి సాయం అందలేదు. గతప్రభుత్వ హయాంలో (2019 వరకు) భూమి యజమాని పట్టా పుస్తకం నకలు చూపించి వేలిముద్ర వేస్తే కౌలు రైతుకు రాయితీ విత్తనాలు ఇచ్చేవారు. జగన్ సర్కారు వచ్చాక అది తీసేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏడాదికి రూ.4 వేల కోట్లకు పైగా పంట రుణాలు ఇప్పించేవారు. జగన్ సర్కారు అందులో సగమైనా ఇవ్వలేదు. రైతు భరోసా రూపంలోనే రూ.9,639 కోట్లు ఎగ్గొట్టారు.
వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి వస్తే వరదలు లేదంటే కరవు. కూలీనాలీ చేసుకుని సంపాదించుకున్న సొమ్ముతో పాటు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే తిరిగి పైసా చేతికి దక్కక అల్లాడిన వారు లక్షల్లో ఉన్నారు. కౌలు రైతులు అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జగన్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో కౌలు రైతుల్లో సగటున 5% మందికైనా ప్రభుత్వ పథకాలు అందలేదు. ఆత్మహత్య చేసుకున్న కౌలు కుటుంబాలకు సాయం అందించడంలో మోకాలొడ్డిన ఘనత జగన్‌కే దక్కుతుంది.
చితికిన కౌలు రైతు బతుకు - గడిచిన ఐదేళ్లుగా ధీమా లేదు, బీమా రాదు! - Jagan Neglect Tenant Farmers