Manchu Manoj in Police Station: పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. సోమవారం అర్ధరాత్రి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్ వెళ్లారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. రాత్రి 11 గంటల 15 నిమిషాల సమయంలో అక్కడికgు వచ్చిన మనోజ్, సుమారు రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు.
మంచు మనోజ్ తన సిబ్బందితో కనుమ రహదారిలోని ఓ రెస్టారెంట్లో బస చేయగా, పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తనతో ఎస్సై దురుసుగా ప్రవర్తించారని మంచు మనోజ్ తెలిపారు. తాము మంచు మనోజ్‌తో ఉన్నామని తన సిబ్బంది చెప్పగా వారిని పోలీసులు స్టేషన్‌కు పిలిచారని ఆయన ఆరోపించారు. తాను స్టేషన్‌కు వచ్చేసరికి ఎస్సై లేరని, ఫోన్ చేస్తున్నా తీయడం లేదని మండిపడ్డారు.
తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేశారు. అనంతరం భాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషాతో మంచు మనోజ్ ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ స్టూడెంట్స్ కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సమాధానంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తన సిబ్బందికి లేదని, పెట్రోలింగ్‌లో భాగంగానే హోటల్ ముందుకు వచ్చి సిబ్బందిని విచారించడం జరిగిందని సీఐ ఇమ్రాన్ బాషా సర్ది చెప్పారు. పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటలకు పైగా ఉన్న మంచు మనోజ్, అనంతరం తిరిగి హోటల్‌కి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం గురించి భాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషాను వివరణ అడగగా, తాము మనోజ్‌ను అరెస్టు చేయలేదని చెప్పారు. పెట్రోలింగ్‌లో భాగంగానే తమ సిబ్బంది అతను ఉన్న హోటల్ ముందు గుంపులుగా జనసంచారం ఉండటంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించామని అన్నారు. అంతే తప్ప మంచు మనోజ్‌ను తాము ప్రశ్నించలేదని, పోలీస్ స్టేషన్‌కు తీసుకురాలేదని, అతనే స్టేషన్‌కు వచ్చారని తెలిపారు.
రౌడీలతో అడ్డుకోవాలనుకుంటున్నారు : మంచు మనోజ్
నాతో పాటు భార్య మౌనికపైనా దాడి చేశారు - పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు