ETV Bharat / opinion

చరిత్ర తిరగరాసిన దిల్లీ ఓటర్లు - ఇంత మార్పు ఎందుకు? - PRATIDHWANI DEBATE ON DELHI VERDICT

కదిలి పోయిన అధికార ఆమ్‌ ఆ‌ద్మీ పార్టీ మూలాలు - కనీసం ఖాతా కూడా తెరవని శతాధిక కాంగ్రెస్‌ పార్టీ - బీజేపీకు సీఎం పీఠం అందించిన అంశాలేంటి?

Pratidhwani Debate on Delhi Verdict
Pratidhwani Debate on Delhi Verdict (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 4:18 PM IST

Pratidhwani Debate on Delhi Verdict : దేశ రాజధానిలో చరిత్ర తిరగరాశారు దిల్లీ ఓటర్లు. సుమారు 27ఏళ్ల తర్వాత కమలదళానికి సునామీలాంటి విజయం అందించారు. విస్పష్టమైన ఆధిక్యంతో అధికారం అప్పగించారు. అధికార ఆమ్‌ ఆ‌ద్మీ మూలాలు కదిలిపోయాయి. శతాధిక పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. కేజ్రీవాల్ సహా ఆప్‌లో కీలకనేతల కోటలు కొట్టుకు పోయాయి. మరి దిల్లీలో ఆప్ జైత్ర యాత్రకు అడ్డుకట్ట వేసిన, చాలాకాలం తర్వాత బీజేపీకు సీఎం పీఠం అందించిన అంశాలేంటి? ఆమ్ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖం అనుకున్న పోరులో అసలేం జరిగింది?

ఓటర్లు కాంగ్రెస్‌ను కనీసం పరిగణనలోకి తీసుకోక పోవడానికి కారణాలేంటి? ఇంతకాలంగా అసెంబ్లీకి ఆప్‌, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంటున్న దిల్లీ ప్రజల తీర్పులో ఇంత మార్పు ఎందుకు? ఈ ఫలితాల్లో మూడు పార్టీలకు పాఠాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు 1‌. ఆర్‌. భరత్ భూషణ్‌(రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్‌) 2. పి. కృష్ణప్రదీప్(జాతీయ రాజకీయాలపై నిపుణులు, హైదరాబాద్)

27ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠం : ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దిల్లీ ఓటర్లు సంకోచాల్లేని స్పష్టమైన తీర్పునిచ్చారని తెలిపారు. 70 స్థానాల అసెంబ్లీపోరులో ఆప్‌-22, బీజేపీ-48, కాంగ్రెస్ సహా ఇంకెవరూ ఖాతా కూడా తెరవలేదని గుర్తుచేశారు. 27ఏళ్ల తర్వాత కమలదళానికి ముఖ్యమంత్రి పీఠం అందిచారన్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ దిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవలేక పోయిందన్నాారు. అదికూడా వరసగా 3వ సారి కాంగ్రెస్ పార్టీ సున్నా సీట్లకు పరిమితం అయ్యిందన్నారు. దిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సహా పలువురు ఆప్‌ కీలకనేతల ఓటమిబాట పట్టారన్నారు.

వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ - మరి వృద్ధిరేటుకు ఎలాంటి ఊతమివ్వనుంది?

ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే సెగలు-అప్పుడే ఎండలు ఎందుకు మండుతున్నాయి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.