Case Filed on Registration Department DIG for Harassing Wife: ఆయనో బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆ విషయం మరిచిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో అత్యంత దారుణంగా ప్రవర్తించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గుంటూరు అరండల్‌పేట ఠాణాలో ఆ ఉన్నతాధికారిపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పని చేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయరాణిని కొన్నేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడాది నుంచి వేరు వేరురుగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కిరణ్‌కుమార్ అనసూయరాణిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం బాధితురాలు గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కిరణ్‌కుమార్ గతంలో గుంటూరు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డీఐజీగా విధులు నిర్వహించారు.
వల్లభనేని వంశీ కేసులో ఆధారాలపై దృష్టి - కిడ్నాప్ సీసీ ఫుటేజ్ లభ్యం
ప్రేమ వివాహం చేసుకున్నాము: ఫిర్యాదు అనంతరం అనసూయరాణి మాట్లాడుతూ తామిద్దరం ప్రేమించుకుని వివాహం చేసుకున్నామని తెలిపారు. తనకు పిల్లలు పుట్టకపోవటంతో పాపను దత్తత తీసుకున్నామని తరువాత సరోగసీ ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. కిరణ్ కొన్నేళ్లుగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. ఆయన పెట్టే వేధింపులు తాళలేక 10 నెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నట్లు వివరించారు.
పాప విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడని ఆమె చెప్పారు. రెండు రోజుల కిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును, తనను కిరణ్ కొట్టారని ఆరోపించారు. గట్టిగా ప్రశ్నిస్తే అట్రాసిటి కేసు పెడతానని బెదిరిస్తున్నారని అన్నారు. దీంతో గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా తన భర్త కిరణ్‌పై కేసు నమోదు చేశారని అనసూయ తెలిపారు.
కళ్లు తిరిగి కాలువలో పడిపోయిన వ్యాపారి - మూడు రోజులుగా చెత్తలోనే