Prathidwani : ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి వేళయ్యింది. పొరుగుదేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఈ నెల 19నుంచే ప్రారంభం కానుంది. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. 2017 అనంతరం సుదీర్ఘ విరామంతో జరుగుతున్న టోర్నీకి మరికొన్ని రోజులే ఉండడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి.
మరి, సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉన్న జట్లేవి? అక్కడి నుంచి టైటిల్ వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు? భారతీయులే కాక యావత్ క్రికెట్ ప్రపంచ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న దాయాదుల పోరులో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? రోహిత్ నాయకత్వంలో టీమిండియా కూర్పుపై విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియకర్ క్రికెట్ విశ్లేషకులు సీ.వెంకటేష్, క్రికెట్ వ్యాఖ్యాత, విశ్లేషకుడు కార్తీక్ యనమండ్ర.
మినీ ప్రపంచకప్‌గా భావించే ఐసీసీ మెగా ట్రోఫీ ఛాంపియిన్స్ టోర్నీకి వేళయ్యింది. 2017 తర్వాత చాలా గ్యాప్ తీసుకుని జరుగుతున్న ఈ ఎడిషన్‌పై అంచనాలు ఎలా ఉన్నాయి ? ఇటీవల వరకు వరస పరాజయాలు, కెప్టెన్ - కోచ్ మధ్య విబేధాలు సీనియర్లపై తీవ్ర విమర్శల నేపథ్యంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి ఎందుకు ప్రత్యేకమైనది? ఎనిమిది జట్లు రెండు గ్రూపులు ఎవర్ని చూసినా బలంగానే కనిపిస్తున్నారు. హోరాహోరీ ఖాయమనే అనిపిస్తోంది. అయితే వీళ్లలో టైటిల్ ఫేవరెట్లు ఎవరు?
నితీష్ మరెన్నో సెంచరీలు సాధించి విజయాన్ని కొనసాగించాలి: చంద్రబాబు
మిగిలిన జట్లు గురించి ఎలా ఉన్నా చాలామంది క్రికెటర్లు కూడా ఇండియా - పాకిస్థాన్ మధ్య ఫైనల్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్పిన్ మాంత్రికుడు ముత్తయ్యసహా. మీరేమంటారు? టైటిల్ సంగతి తర్వాత భారతీయులే కాక యావత్ క్రికెట్ ప్రపంచ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న దాయాదుల పోరుపై అంచనాలు, ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? అంచనాలు సరే టైటిల్ ఫేవరేట్లలో ఒకరిగా బరిలో దిగుతోన్న టీమిండియా కూర్పు ఎలా ఉంది ఈసారి ? ఈ అయిదుగురు స్పిన్నర్ల ఎంపిక మర్మమేంటి?
టీమిండియా కూర్పు ఒకెత్తయితే ఫైనల్ -11 ఎవరు ఆడతారనే విషయంలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ అంచనాల్లో ఎవరున్నారు? టీమిండియాకు మొదట్నుంచీ కూడా నాణ్యమైన పేసర్ల కొరత వేధిస్తునే ఉంది. ఇప్పుడు బుమ్రా లాంటి వాళ్లు కూడా దూరం కావడం ప్రతికూలం కాదా ఆ లోటును భర్తీ చేసేదెవరు? అనే అంశాల గురించిన సమగ్ర సమాచారం ఈ కార్యక్రమం ద్వారా తెసుసుకుందాం.