ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

ఆరు విధానాలు నవ్యాంధ్ర లక్ష్యాలు - బ్రాండ్ ఏపీకి గ్రాండ్ బాటలు - NDA GOVT 6 POLICIES

20 లక్షల ఉద్యోగాలు రూ. లక్షల కోట్ల పెట్టుబడులు - ఒకటే రోజు 6 విధానాలు విడుదల చేసిన రాష్ట్రప్రభుత్వం

NDA_GOVT_6_POLICIES
NDA_GOVT_6_POLICIES (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 4:04 PM IST

Prathidwani :ప్రతిచేతికి పని కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటే రోజు 6 కీలక విధానాలు ప్రకటించి ఆశ్చర్య పరిచింది. అయిదేళ్లుగా పడావుబడ్డ పారిశ్రామికరంగానికి కొత్త ఊపిరి ఇవ్వడం , అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశ్రామికాభివృద్ధి, ఎంఎస్​ఎంఈలు, ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్‌లు, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీలు విధానాలు గేమ్‌ ఛేంజర్లు కానున్నాయి. మరి దీనిపై పారిశ్రామికవర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? గడిచిన అయిదేళ్లు జరిగిన నష్టమేంటి? రానున్న అయిదేళ్లు, ఆ తర్వాతి భవిష్యత్ ముఖచిత్రమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేష్​ కుమార్​, ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు.


ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా అనంతపురంలో ఆటోమోటివ్‌, కడప, కర్నూలులో పునరుద్పాదక ఇంధనం, ప్రకాశంలో బయోఫ్యూయల్‌, గోదావరిలో ఆక్వా, పెట్రోకెమికల్స్, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, రక్షణ రంగాలపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని మంత్రి లోకేశ్ అన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఐటీఐ , పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత రంగాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్‌ ఉందన్న లోకేశ్‌ ఒక్క జపాన్‌లోనే 50 వేల మంది బ్లూకాలర్‌, నర్సింగ్‌ ఉద్యోగులు కావాల్సి ఉందన్నారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం - విద్య, ఉపాధి కల్పనపై లోకేశ్ ప్రత్యేక దృష్టి

విశాఖలో 7 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి విభాగం అభివృద్ధి చేస్తున్న పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వ జాబ్‌ పోర్టల్‌తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న జెమ్స్‌-జ్యుయలరీ సెంటర్‌ను అధ్యయనం చేశామని త్వరలోనే ఆ సంస్థ అధికారులను రాష్ట్రానికి ఆహ్వానించి వారి సూచనలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 ఆదర్శ కెరీర్‌ కేంద్రాలు మంజూరు కాగా ఇప్పటికే 12 ప్రారంభమయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏపీ పెట్టుబడుల స్వర్గధామం - పెట్టుబడిదారులకు వాట్సప్​లో అప్​డేట్స్ : లోకేశ్

ABOUT THE AUTHOR

...view details