Vallabhaneni Vamsi Case Updates : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ బెదిరించిన కేసులో బాధితుడు సత్యవర్ధన్ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు విజయవాడ రెండో జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సుమారు గంటపాటు రికార్డ్ చేశారు. నిబంధనల ప్రకారం కోర్టు హాలు తలుపులు మూసేసి ఇతరులను లోనికి రానీయకుండా స్టేట్మెంట్ నమోదు చేశారు. పోలీసులు సత్యవర్ధన్‌ను కోర్టు హాల్ నుంచి మీడియా కంటపడకుండా రహస్యంగా తీసుకెళ్లారు.
అసలేం జరిగిదంటే : సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, దివంగత నేత బచ్చుల అర్జునుడి కుమారుడు సుబ్రహ్మణ్యంతో కలిసి వెళ్లి సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కిడ్నాప్ చేస్తూ సీసీ కెమెరాలు మరిచారు - మరోసారి అడ్డంగా దొరికిపోయిన వంశీ గ్యాంగ్
వంశీ ఇంట్లో సోదాలు - దొరకని ఫోన్ - వెనుదిరిగిన పోలీసులు
