Margadarsi Branch in Chitradurga : మార్గదర్శి చిట్‌ఫండ్ నమ్మకానికి చిరునామాగా నిలిచింది. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ప్రజల ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కలలు మీవి, వాటికి సాకారం చేసే ఆర్థిక సహకారం మాది అంటూ నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది. ఇంటి నిర్మాణం, వ్యాపార ప్రారంభం, విస్తరణ, పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, చింతలేని పదవీవిరమణ జీవితం ఇలా అవసరమేదైనా అందరి ఏకైక ఎంపికగా నిలిచింది మార్గదర్శి.
ప్రజల ఆర్థిక అవసరాలకు ఆలంబనగా నిలుస్తూ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో చందాదారుల అభిమానం చూరగొంది మార్గదర్శి చిట్‌ఫండ్. ఈ క్రమంలోనే తన 122వ శాఖను ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రారంభించింది. సంస్థ ఎండీ శైలజా కిరణ్ నూతన శాఖను ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి తొలి ఖాతాదారునికి ఆమె రసీదు అందజేశారు. చిత్రదుర్గలో నూతనశాఖ ఏర్పాటు చేయడంపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు.
Chitradurga Margadarsi Branch : మార్గదర్శిపై తమకు ఉన్న నమ్మకాన్ని వారు వివరించారు. త్వరలో మరో ఐదారు శాఖలు ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్స్ కర్ణాటక విభాగం డైరెక్టర్ లక్ష్మణరావు, మార్గదర్శి ఉపాధ్యక్షుడు బలరామకృష్ణ, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
"నాలుగు రాష్ట్రాల్లో మార్గదర్శి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో శాఖలున్నాయి. ఇవాళ ప్రారంభించిన చిత్రదుర్గ బ్రాంచ్ కర్ణాటకలో 26వ శాఖ. నాలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే ఇది 122వ శాఖ. మరో ఐదారు శాఖలు ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నాం. ఈ ఏడాది మా టర్నోవర్ రూ.10,000ల కోట్లు దాటింది." - శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ
"నేను చాలా సంవత్సరాల నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్ చందాదారుడిగా ఉన్నాను. నా పిల్లల విద్యకు, అలాగే కుటుంబ అభివృద్ధికి మద్దతుగా నిలిచింది. నా కుటుంబంపై ఎంత నమ్మకం ఉందో మార్గదర్శిపై అంతే నమ్మకం ఉంది."- మార్గదర్శి చిట్‌ఫండ్ ఖాతాదారుడు
Margadarshi Chit Funds Journey : మార్గదర్శి సంస్థ 1962 అక్టోబర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలై ప్రస్తుతం 122 బ్రాంచ్‌లతో అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ మంచి పేరు సంపాదించుకుంది. వినియోగదారులే దేవుళ్లు అన్న నినాదంతో అన్ని వర్గాల ఆశలకు మార్గదర్శకత్వం చేసేలా ఉండాలన్న లక్ష్యంతో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు ఏర్పాటు చేశారు. మార్గదర్శి సంస్థ ఆరు దశాబ్దాలుగా దాదాపు 60 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
మార్గదర్శి మరో మూడు శాఖలు - వర్చువల్‌గా ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్