పరీక్షల వేళ విద్యార్థులు ర్యాంకుల ఒత్తిడిని అధిగమించేదెలా? - HOW TO BEAT EXAMS PRESSURE - HOW TO BEAT EXAMS PRESSURE
How To Beat Exams Pressure For Students : పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు రాకపోతే, ర్యాంకులు రాకపోతే ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. ఆ సమయాల్లో విద్యార్థులు ఒత్తిడిని ఏవిధంగా ఎదుర్కోవాలి, గుండెనిబ్బరంగా ఎలా ఉండాలనే దానిపై నేటి ప్రతిధ్వని.
Published : Apr 28, 2024, 1:20 PM IST
Competitive Exams for Students Prathidwani Today : వార్షిక పరీక్షల ఫలితాలు, ర్యాంకుల పోటీల్లో తడబడిన విద్యార్థుల గుండె చెదురుతోంది. మితిమీరిన అంచనాలను అందుకోలేక ఒత్తిడికి గురైన విద్యార్థులు అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు. ఏటా పరీక్షలు, ఫలితాల విడుదల సమయంలో గండెనిబ్బరం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య వేలల‌్లో ఉంటోంది. దేశ భవిష్యత్తుకు బలమైన బాటలు వేయాల్సిన విద్యార్థిలోకం ఎందుకిలా కుంగిపోతోంది? ర్యాంకుల వేటలో వెనుకబడినంత మాత్రాన జీవితం ఆగిపోదన్న అవగాహన ఎందుకు కొరవడుతోంది? విద్యార్థులను ఆత్మహత్యల ఊబిలోనుంచి బయటకు లాగి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించేదెలా? ఇదే నేటి ప్రతిధ్వని.