మహిళలను గౌరవించడంపై ప్రత్యేక పాఠ్యాంశం - పాఠశాల స్థాయి నుంచే బోధించేలా ప్రణాళిక! - Prathidhwani on Women - PRATHIDHWANI ON WOMEN
Debate on Women : మహిళలపై ఇంటా బయటా హింస నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మహిళలను గౌరవించడం అనే అంశంపై ప్రత్యేక పాఠ్యాంశం రూపొందించి పాఠశాల స్థాయి నుంచే బోధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి సీతక్క ఇటీవల తెలిపారు. మరి స్కూల్, కాలేజ్ కంటే ముందే అసలీ మార్పు, గౌరవ బోధ ఎక్కడ ప్రారంభం కావాలి? ఇంటి స్థాయిలో పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Published : Aug 31, 2024, 10:31 AM IST
Prathidhwani about Women : ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు పెద్దలు. ఎక్కడ మహిళలు గౌరవం పొందుతారో అక్కడ దేవతలు నడయాడతారు అని నమ్మే సంప్రదాయ భారతం మనది. కానీ వాస్తవంలో జరుగుతోందేంటి? తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్నబిడ్డగా సమున్నత, సముచిత మన్నన అందుకోవాల్సిన మహిళలపై ఇంటా బయటా హింస నానాటికి పెరిగిపోతోంది. అవమానాలు, అఘాయిత్యాలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను గౌరవించడం అనే అంశంపై ప్రత్యేక పాఠ్యాంశం రూపొందించి పాఠశాల స్థాయి నుంచే బోధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అసలు ఈ గౌరవ పాఠాలు ఎక్కడ మొదలు కావాలి? ఆడబిడ్డను ఆదరంగా చూసే పరిస్థితులు రావడానికి ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.