ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీకి ఎదురుగాలి - ఈసారి గట్టెక్కడం అంతంతమాత్రమే! - ETV Bharat Prathidwani - ETV BHARAT PRATHIDWANI

ETV Bharat Prathidwani: సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఆయన చెల్లెళ్లు షర్మిలా, సునీత వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వివేకా హత్య కేసు విషయంలో జగన్ అనుసరించిన తీరు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఆ జిల్లా వాసులు అంటున్నారు. 'కడప గడపలోనే కదులుతున్న పునాదులు' అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు రవిశంకర్ రెడ్డి, సామాజిక విశ్లేషకులు నూర్‌ మహ్మద్ పాల్గొన్నారు.

ETV Bharat Prathidwani
ETV Bharat Prathidwani (Prathidwani debate (ఈటీవీ భారత్ ప్రత్యేకం))

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 10:54 AM IST

ETV Bharat Prathidwani :సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఆయన చెల్లెళ్లు షర్మిలా, సునీత వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వివేకా హత్య కేసు విషయంలో జగన్ అనుసరించిన తీరు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఆ జిల్లా వాసులు అంటున్నారు. మరోపక్క కడప జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో, అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులను ఆదుకోవటంలో జగన్ పూర్తి వైఫల్యం చెందారు. కడప ఉక్కుపరిశ్రమకు రెండుసార్లు శంకుస్థాపన చేసి నవ్వులపాలయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా రేగిన కాక ఇంకా చల్లారలేదు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కొంపముంచేలా ఉంది. కడప జిల్లాలోనే వైసీపీకు ఎదురుగాలి వీస్తుంటే రాష్ట్రవ్యాప్త పరిస్థితి ఏంటి? 'కడప గడపలోనే కదులుతున్న పునాదులు' అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు రవిశంకర్ రెడ్డి, సామాజిక విశ్లేషకులు నూర్‌ మహ్మద్ పాల్గొన్నారు.

YS Sharmila Criticized CM Jagan: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా ఆరోపించారు. గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో షర్మిల బస్సు యాత్రలో పాల్గొన్న ఆమె సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్ కి వివేకా అలా ఉండే వారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యింది. ఎవరు చంపారో సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని వాపోయారు. చనిపోయింది వైఎస్ఆర్ తమ్ముడు, హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్ లో కర్ఫ్యూ సృష్టించారని చెప్పారు.

వైఎస్సార్ జిల్లాలో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యం - జగన్​ గట్టెక్కడం అంతంతమాత్రమే ! - Kadapa LOK SABHA ELECTIONS

సీఎం జగన్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్​ను కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఆర్టీపీపీని అదానీ, అంబాణీలకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తే ఆర్టీపీపీని మాయం చేస్తారని ఆరోపించారు. ఇదే థర్మల్ ప్లాంట్ లో 2 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం జగన్ గారు పాదయాత్ర కొచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తొలి సంతకం ఇదే అవుతుంది అని చెప్పారని పేర్కొన్నారు. కానీ జగన్ తాను ఇచ్చిన హామీ మరిచారని ఎద్దేవా చేశారు.

వైఎస్ఆర్ కడప స్టీల్ ప్లాంట్ కట్టాలని అనుకున్నారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. అయితే. వైఎస్ఆర్ మరణం తర్వాత కడప స్టీల్ అటకెక్కిందని, చంద్రబాబు ఒక సారి శంకుస్థాపన చేస్తే, జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారని దుయ్యబట్టారు. కడప స్టీల్ ప్లాంట్ స్థాపన జరిగి ఉంటే, ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు సర్వనాశనం చేశారు, బాబు, జగన్ ముఖ్యమంత్రులుగా ఉండి కనీసం రాజధాని కూడా కట్టలేక పోయారని విమర్శించారు.

మన పక్కన ఉన్న రాష్ట్రాలకు హైద్రాబాద్, చెన్నై, బెంగళూరులు రాజధానులుగా ఉన్నాయని, మరి మన రాజధాని ఎక్కడంటూ షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి మూడు రాజధానులని చెప్పి, రాష్ట్రానికి ఒక్క రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు. జగన్ కి రాష్ట్ర అభివృద్ది కన్నా, హత్యా రాజకీయాలు ఎక్కువ అని ఆరోపించారు. బాబాయిని చంపిన హంతకుడు నీ జగన్ కాపాడుతున్నాడని పేర్కొన్నారు. వివేకా ఆత్మ ఈ గడ్డమీద ఇంకా ఘోశిస్తుందని, న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా హంతకులకు సీఎం జగన్ అండ- పులివెందుల ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలి : షర్మిల - YS Sharmila allegations

ABOUT THE AUTHOR

...view details