Pratidhwani : గ్రీన్ హైడ్రోజెన్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తోన్న సరికొత్త ఇంధనం! ఆ క్రమంలోనే భారత దేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఇటీవలే కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి పునరుత్పాదక వనరుల్ని ప్రోత్సహించే దిశగా వేస్తున్న అడుగుల వేగం పెంచింది. సమస్యల్లేని శుద్ధఇంధనం కోసం శ్రీకారం చుడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరంలోనే అందుకు సంబంధించి మొదటిన హబ్ ఏర్పాటు కానుంది.
మరి ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ ఏమిటి? ఇది ఇంధనరంగాన్ని ఎలా మలుపు తిప్పనుంది? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజల జీవనంలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశ్రాంత డైరెక్టర్ డా. వీఎస్‌ఆర్కే ప్రసాద్. హెచ్‌పీసీఎల్ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఐసీటీ సలహాదారు, పెట్రోకెమికల్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవశాలి డా. ఎన్వీ చౌదరీ.
గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? ఇది ప్రపంచ ఇంధన రంగం ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది? కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినట్లు విశాఖ పూడిమడక వద్ద ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రాధాన్యత ఏమిటి? శిలాజ ఇంధనాల్ని తగ్గించడం, భారతదేశం పెట్టుకున్న నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవడానికి గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఉపయోగ పడుతుంది? హైడ్రోజన్‌లో మనకు అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఎందుకు ప్రత్యేకమైంది? దీనికి హ్యాండ్లింగ్, ఉత్పత్తి వ్యయాలు ఎలా ఉంటాయి?
చంద్రబాబు ఇష్టాగోష్టి- గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం అనుభవాలు ఎలా ఉన్నాయి? దీని ప్రయోజనాలు, సవాళ్లపై అవేం చెబుతున్నాయి? విశాఖ తీరంలో రాబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అవకాశాలు అందిస్తుంది? దీనికి అనుబంధంగా ఎలాంటి అభివృద్ధి అవకాశాలు ఉంటాయి? హరిత ఇంధనరంగంలో తమదైన ముద్ర కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గ్రీన్ హైడ్రోజన్ మొత్తంగా ఎలాంటి అవకాశాలు అందించవచ్చంటారు? వంటి మరిన్ని అంశాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.
భారత గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో కీలక ఘట్టం - విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డు ముందడుగు