Women Dies After Vada Got Stuck in Throat :గొంతులో గారె ఇరుక్కునిపోయి ఊపిరాడక ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడకు చెందిన మొక్కా తిరుపతమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె పెద్ద కుమారుడు రామకృష్ణ ఇంటి సమీపంలో చిన్న గదిలో ఒంటరిగా ఉంటుంది.
పిలుద్దామన్నా ఎవరూ లేక : అదే గ్రామంలో ఉండే చిన్న కుమారుడు శ్రీను పండుగ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తల్లి వద్దకు వచ్చి గారెలు ఇచ్చి వెళ్లాడు. వృద్ధురాలు వాటిని తిందాం అనుకుంది. అలా వాటిని తినే క్రమంలో వృద్ధురాలు గొంతులో గారెముక్క ఇరుక్కుంది. పక్కన పిలవాలునుకున్నా ఎవరూ లేరు. దీంతో ఊపిరాడక చనిపోయింది. సాయంత్రం సమయంలో పెద్ద కుమారుని కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ఆమె చనిపోయింది. కుమార్తె ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరావు తెలిపారు.