తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రోడ్​సైడ్​ ఫాస్ట్​ఫుడ్​తో ఆరోగ్యానికి ముప్పు - ఇంట్లోనే మమ్మీని "గోధుమపిండి మంచూరియా" చేయమనండి! - ఇలా చేస్తే అదుర్స్ - Wheat Flour Manchurian

Manchurian: నూడుల్స్‌, మంచూరియా.. వంటి ఫాస్ట్ ఫుడ్​ను ఇష్టపడని పిల్లలు ఉండరేమో. కానీ.. రోడ్​ సైడ్​ సెంటర్లలో తింటే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదని నిపుణులు చెబుతారు. అందుకే.. ఇంట్లోనే హెల్దీగా "గోధుమపిండి మంచూరియా" ప్రిపేర్ చేయండి. పిల్లలు యమ్మీ అంటూ లాగించేస్తారు.

Manchurian
Manchurian (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 10:06 AM IST

Wheat Flour Manchurian: ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి పాస్తా, మ్యాగీ వంటివి సరిపోతాయి. కానీ.. కాస్త పెద్దవాళ్లు అయితే మాత్రం ఫాస్ట్ ఫుడ్​ సెంటర్లకు పరుగులు తీస్తారు. అయితే.. అక్కడ దొరికే నూడుల్స్, మంచూరియా వంటి ఐటమ్స్​లో కలిపే పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే.. ఇంట్లో మమ్మీలే గోధుమపిండితో "మంచూరియా" చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • ఉప్పు - సరిపడా
  • కారం - 1 టేబుల్​ స్పూన్​
  • పసుపు - టీ స్పూన్​
  • టమాట గుజ్జు - అరకప్పు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి -4
  • క్యాప్సికం - 1
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూన్​
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • మిరియాల పొడి - 1 టేబుల్​ స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం - కొద్దిగా(ఆప్షనల్​)

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లో గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, నూనె వేసి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి.
  • ఆ తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెన్​ సాయంతో చపాతీలను సన్నగా రోల్​ చేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి అందులో నీరు, నూనె, కొద్దిగా ఉప్పు వేసి మరిగించుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు ఈ చపాతీ రోల్స్​ వేసుకుని ఓ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • చల్లారిన తర్వాత రోల్స్​ను చిన్న చిన్న స్ప్రింగ్స్​గా కట్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద పాన్​ పెట్టి.. నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి.
  • అనంతరం ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి టమాట గుజ్జు వేసుకుని కలుపుకోవాలి.
  • అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఓ రెండు నిమిషాల ఉడికించిన తర్వాత కట్​ చేసుకున్న స్ప్రింగ్స్​ వేసుకుని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకుంటే సరి. ఎంతో టేస్టీ అండ్​ స్పైసీ గోధుమపిండి మంచూరియా రెడీ.
  • తినేటప్పుడు నిమ్మరసం చల్లుకుంటే టేస్ట్​ ఇంకా అద్దిరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details