తెలంగాణ

telangana

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి - Wheat Flour Badusha Recipe at Home

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Balushahi Sweet: బాదుషా స్వీట్ చాలా మందికి ఇష్టం. కానీ.. దాన్ని మైదా పిండితో తయారు చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు తినకుండా ఉంటారు. అందుకే.. గోధుమ పిండితో అద్భుతమైన బాదుషా తయారు చేయొచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Godhuma Pindi Badusha
Wheat Flour Badusha Recipe at Home (ETV Bharat)

Wheat Flour Badusha Recipe at Home:బయట క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా, జ్యూసీగా ఉండే బాదుషా.. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అయితే బాదుషాలు తినాలంటే బయట స్వీట్​ షాప్స్​ నుంచి తెచ్చుకోవాల్సిందేనని చాలా మంది భావిస్తారు. కానీ ఇవి తయారుచేయడం చాలా సులభం. సరైన కొలతలతో పిండిని కలుపుకుంటే బాదుషాలు చక్కగా వస్తాయి. మరి.. గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • బేకింగ్​ పౌడర్​ - అర చెంచా
  • నెయ్యి - రెండు చెంచాలు
  • నీరు - సరిపడా
  • నెయ్యి - డీప్​ ఫ్రైకి సరిపడా

పాకం కోసం:

  • పంచదార - 1 కప్పు
  • నీరు - 1 కప్పు
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్
  • పటిక - చిటికెడు

పిండి, నెయ్యి అక్కర్లేదు - కేవలం పాలు, చక్కెరతో బ్రహ్మాండమైన "మిల్క్ గులాబ్ జామూన్" రెడీ!

తయారీ విధానం:​

  • ముందుగా ఓ బౌల్​ తీసుకుని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ఉప్పు, బేకింగ్​ పౌడర్​, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ సమయంలో పిండి పట్టుకుని ఒత్తితే ముద్దలాగా అయ్యిందంటే బాగా కలుపుకున్నట్టు. అలా రాలేదంటే మరోసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ ఓ 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తడి క్లాత్​ కప్పి లేదా మూత పెట్టి ఓ పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాకం ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం పాన్​ పెట్టి పంచదార, నీరు పోసి పంచదార కరిగించుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి, పటిక వేసుకుని పాకం జిగటగా మారేంతవరకు కలుపుకోవాలి. అంటే గులాబ్​జామున్​ పాకానికి ఎక్కువగా.. తీగ పాకానికి తక్కువగా ప్రిపేర్ చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకుని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అందులో ఒక ఉండను తీసుకుని రౌండ్​గా చేసుకుని కొద్దిగా వెడల్పు అని బాదుషా షేప్​లో చేసుకోవాలి. ఇలా మిగిలిన ఉండలను కూడా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మంటను సిమ్​లో పెట్టి కొన్ని బాదుషాలను నూనెలో వేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా.. అవి పైకి తేలేంతవరకు సిమ్​లోనే ఉంచుకోవాలి. బాదుషాలు నూనె పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాదుషాలను గోరువెచ్చని పంచదార పాకంలో వేసి ఓ రెండు గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకుని పాకంలో వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత సర్వ్​ చేసుకుని తింటే మాటలు ఉండవ్. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపించేత బాగుంటాయి. అయితే.. ఇవి చేయడం మొదటి సారి అయితే తక్కువ పిండితో చేసుకోవడం మంచిది.

ఎప్పుడైనా తెలంగాణ సర్వపిండి తిన్నారా! తింటే వదిలిపెట్టరు - పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు

ఎప్పడూ ఒకేరకమైన పూరీ ఏం బాగుంటుంది? - ఈసారి బెంగాలీ స్టైల్​ "రాధాభల్లబి పూరీలు" చేయండి - టేస్ట్​ సూపర్​!

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "బనానా హల్వా" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details