తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

గూగుల్​ పే, ఫోన్​ పేలో పే చేస్తున్నారా? - రోజుకు ఏ బ్యాంకుకు లిమిట్​​ ఎంతో తెలుసా? - How much UPI transactions in banks - HOW MUCH UPI TRANSACTIONS IN BANKS

UPI Limit in a Bank : నిత్యం ఏది కొనాలన్నా ఆన్​లైన్​లోనే పేమెంట్స్​ చేస్తున్నాం. అసలు రోజుకు ఎన్నిసార్లు యూపీఐ పేమెంట్​ చేయాలో తెలుసా? అసలు ఏ బ్యాంక్​ ఎంత పరిమితి వరకు యూపీఐ లిమిట్​ పెట్టాయో తెలుసా? అయితే ఇది చూడండి.

UPI Limit in a Bank
UPI Limit in a Bank (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 2:34 PM IST

What is UPI Limit in a Bank : ఇప్పుడు ప్రతి ఒక్కరు పేమెంట్ చేయాలంటే వెంటనే ఫోన్​ తీసి యూపీఐ ద్వారా డిజిటల్​ చెల్లింపులు చేస్తున్నారు. అలాగే ఆన్​లైన్​లో చాలానే చాలానే చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి డిజిటల్​ చెల్లింపులు దేశంలో ఊపందుకున్నాయి. ఇప్పుడు ఈ యూపీఐ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఉపయోగించే సాధనంగా మారిపోయింది. తాజాగా ఆర్​బీఐ యూపీఐ లైట్​ పేరుతో డిజిటల్​ చెల్లింపులను మరింత పెంచేందుకు మార్పులు తీసుకొచ్చింది. అయితే రోజువారీ చెల్లింపుల్లో మాత్రం ఆర్​బీఐ బ్యాంకులకు పరిమితులు విధించింది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందామా?

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్(HDFC BANK)​ : ఈ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. 24 గంటల్లో గరిష్ఠంగా 20 లావాదేవీలకు అనుమతి ఇస్తోంది.

ఎస్​బీఐ(SBI) : రోజువారి చెల్లింపుల మొత్తాల పరిమితిని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రూ.లక్షగా నిర్ణయించింది. ఎస్​బీఐ తరహాలోనే యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, యెస్​ బ్యాంక్​, డీసీబీ బ్యాంక్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​లు ఇదే పరిమితిని అనుసరిస్తున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్(ICICI BANK)​ : ఈ బ్యాంక్​లో గరిష్ఠం లావాదేవీల పరిమితి రూ.లక్షగా నిర్ణయించారు. అన్ని లావాదేవీలు కలిపి రోజు మొత్తంలో రూ. లక్ష వరకే అనుమతి ఇస్తోంది. 24 గంటల్లో గరిష్ఠంగా 10 లావాదేవీలు జరిపేందుకు ఈ బ్యాంక్​ అనుమతిని ఇస్తోంది.

కెనరా బ్యాంక్‌ (Canara Bank): యూపీఐ ద్వారా చేసే వ్యక్తిగత లావాదేవీలపై కెనరా బ్యాంక్​ రూ.లక్ష పరిమితిని విధించింది. రోజుకు 20 వరకు లావాదేవీలు చేయవచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB): రోజువారీ చెల్లింపుల పరిమితిని బ్యాంక్‌ ఆప్‌ బరోడా రూ.లక్షగా పేర్కొంది. రోజులో గరిష్ఠంగా 20 లావాదేవీలు జరపవచ్చు. ఇందుకు బ్యాంక్​ ఆఫ్​ బరోడా అవకాశం కల్పించింది.

యాక్సిస్‌ బ్యాంక్‌(AXIS BANK): యాక్సిస్ బ్యాంక్​ డెబిట్​ ఫండ్​ చెల్లింపులు లేదా వ్యక్తిగత చెల్లింపులపై రోజువారీ లిమిట్​ను రూ.లక్షగా నిర్ణయించింది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌(Kotak Mahindra) : ఈ బ్యాంక్​లో గరిష్ఠంగా రూ.లక్ష వరకు బదిలీ చేయవచ్చు. రోజులో 10 లావాదేవీలు చేయాలి. ఒకవేళ క్యూఆర్​ కోడ్​ని అప్​లోడ్​ చేసి డబ్బు చెల్లింపులు చేయాలంటే రూ.2,000 వరకు మాత్రమే అనుమతిస్తోంది.

ఈ లావాదేవీలపై పెంపు : తాజాగా ఆర్​బీఐ యూపీఐ ద్వారా చేసే లావాదేవీలకు పన్ను చెల్లింపుల పరిమితిని పెంచింది. ఈ మొత్తాలు రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఆస్తి పన్ను, ముందస్తు పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించవచ్చు. అదే క్యాపిటల్​ మార్కెట్స్​, ఇన్సూరెన్స్​, పారిన్​ ఇన్​వార్డ్​ రెమిటెన్స్​లకు రూ.2 లక్షలు, ఐపీఓ, రిటైల్​ డైరెక్ట్​ స్కీమ్​లో రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చు. కానీ వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ లావాదేవీలను మాత్రం రూ.1 లక్ష వరకే అనుమతిస్తోంది.

క్రెడిట్ కార్డ్​తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments

డెబిట్​ కార్డ్ మర్చిపోయారా? డోంట్ వర్రీ - ATM నుంచి మనీ విత్​డ్రా చేయండిలా! - Cardless Cash Withdrawal From ATM

ABOUT THE AUTHOR

...view details