Tips To Save Wooden Furniture From Termites :ఇంట్లో చెక్కతో చేసిన ఫర్నీచర్ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇవి ఇంటిని అందంగా, ఆకర్షనీయంగా కనిపించేలా మార్చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది ఎన్నో వేల రూపాయలు ఖర్చుచేసి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, వర్షాకాలంలో గాలిలోని అధిక తేమ కారణంగా ఖరీదైన ఈ ఫర్నీచర్ చెదలు పట్టే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే చెక్క ఫర్నీచర్ పూర్తిగా పాడైపోతుంది. అయితే, ఈ సీజన్లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఫర్నీచర్ చెదలు పట్టకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో చూసేయండి..!
క్లీన్ చేయండి:రోజూ ఏదోక విధంగా ఇంట్లో ఉండే సోఫా సెట్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ వంటి వాటిపై దుమ్ము ధూళీ పడుతుంటుంది. వీటిని క్లీన్ చేయకపోతే ఫర్నీచర్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే వారానికి రెండుమూడుసార్లు ఫర్నీచర్ క్లీన్ చేయాలి. ఇందుకోసం, చిన్న గిన్నెలో నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసుకుని ఫర్నీచర్‌పై స్ప్రే చేసి.. పొడి వస్త్రంతో తుడవండి. ఇలా చేస్తే ఫర్నీచర్ చెదలు పట్టకుండా ఉండడంతో పాటు, డస్ట్ తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
2012లో 'జర్నల్ ఆఫ్ ఎంటమోలాజికల్ సైన్స్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెనిగర్.. చెద పురుగులను నివారించడంలో సమర్థవంతంగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని జియోంగ్‌సాంగ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ చాంగ్-యోంగ్ ఓ' పాల్గొన్నారు. చెద పురుగులను నివారించడంలో వెనిగర్ బాగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
వేప నూనె :చెద పురుగులను నివారించడంలో వేప నూనె కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని అంటున్నారు. ముందుగా వేప నూనెను ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని చెదలు పట్టిన చోట స్ప్రే చేయండి. లేకపోతే ఒక పొడి వస్త్రంపై కొద్దిగా వేప నూనెను పోసి చెదలున్న చోట రాయొచ్చు. ఇలా చేస్తే.. చెద పురుగులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ స్ప్రేని కిటికీలు, తలుపులు, గది మూలల్లో స్ప్రే చేయడం వల్ల దోమలు, కీటకాలు రాకుండా ఉంటాయట.
ఈ జాగ్రత్తలు కూడా: