How to Reduce Excess Turmeric in Curries: ఏ కూరలోనైనా కారం, ఉప్పు, మసాలాలు, పసుపు ఇలా అన్ని పదార్థాలు సరిగ్గా వేస్తేనే రుచి బాగుంటుంది. కానీ, అనుకోకుండా కొన్నిసార్లు కూరలు వండే క్రమంలో కారం, ఉప్పు ఎక్కువైపోతుంటాయి. కూరలో ఉప్పు తక్కువైతే తర్వాత మనం అన్నం తినేటప్పుడు వేసుకోవచ్చు. పొరపాటున కారం, ఉప్పు ఇలా ఏదైనా ఎక్కువైతే మాత్రం కూర రుచి మొత్తం పోతుంది. అయితే, ఎప్పుడూ ఉప్పు, కారం మాత్రమే కాదు.. కొన్నిసార్లు కూరల్లో పసుపు కూడా ఎక్కువైపోతుంటుంది. దీంతో కర్రీ మొత్తం పసుపు రంగులోకి మారి.. తింటుంటే కాస్త చేదుగా అనిపిస్తుంది. అయితే, ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూరలో పసుపుని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో మీరు చూసేయండి..
నిమ్మరసం, టమాటా పేస్ట్ : కూరలో పసుపు ఎక్కువైతే అందులో కొద్దిగా నిమ్మరసం కలపండి. వెనిగర్ కూడా కలవచ్చు. అలాగే వీలైతే ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని కర్రీలో కలపండి. ఇలా చేస్తే కర్రీలో పసుపు తగ్గిపోతుంది.
బంగాళదుంప తురుము : కర్రీలో పసుపు ఎక్కువైతే ఒక బంగాళదుంప తురుము వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి. కర్రీలోని పసుపుని ఆలుగడ్డు బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ట్రిక్ని మీరు కూరలో ఉప్పు, కారం ఎక్కువైనా ఉపయోగించవచ్చు.
పెరుగు, క్రీమ్ : చాలామందికి భోజనం చేసిన తర్వాత చివర్లో పెరుగుతో తినడం అలవాటు. అందుకే దాదాపు మనందరి ఇళ్లలో పెరుగు తప్పకుండా ఉంటుంది. అయితే, పెరుగుతో కూరలో పసుపుని తగ్గించవచ్చని మీకు తెలుసా?. కూర ఎంత వండారో దాన్ని బట్టి రెసిపీలో పెరుగు కలపండి. ఇక్కడ మీరు పెరుగుకు బదులుగా క్రీమ్ కూడా ఉపయోగించవచ్చు. ఈ చిట్కాతో కర్రీ చిక్కగా మారడంతో పాటు.. రుచి మరింత పెరుగుతుంది.
కొబ్బరి పాలు : కూరలో పసుపు ఎక్కువైపోయి చేదుగా మారితే కర్రీలో కొన్ని కొబ్బరి పాలు కలపండి. ఇవి కూరలో చేదుని తగ్గించడంతో పాటు.. రుచిని పెంచుతాయి.
మసాలా పొడులు : అనుకోకుండా కూరలో పసుపు ఎక్కువైపోతే రుచి మొత్తం మారిపోతుంది. ఇలాంటప్పుడు కర్రీలో ధనియాల పొడి, యాలకుల పొడి, జీలకర్ర పొడి వంటివి ఏదైనా ఒకటి కలిపితే టేస్ట్ బాగుంటుంది.
కూరలో కారం ఎక్కువైందా ? టెన్షన్ అక్కర్లేదు, ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్!
కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!