ETV Bharat / sports

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ: జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా- టీమ్​లోకి కొత్త కుర్రాడు - BORDER GAVASKAR TROPHY 2024

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ : జట్టు ప్రకటించిన ఆసీస్- జట్టులోకి కొత్త కుర్రాడు

Border Gavaskar Trophy
Border Gavaskar Trophy (Source: AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 10, 2024, 12:02 PM IST

Border Gavaskar Trophy 2024 : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ సిరీస్​లో భారత్​తో ఆస్ట్రేలియా ఐదు టెస్టులు ఆడాల్సి ఉండగా, తొలి మ్యాచ్​కు మాత్రమే జట్టును అనౌన్స్​ చేసింది. 13 మందితో కూడిన జట్టును వెల్లడించింది. ఈ జట్టుకు పాట్ కమిన్స్​ నాయకత్వం వహించనున్నాడు. కాగా, ఈ జట్టులో కొత్త కుర్రాడు చోటు దక్కించుకున్నాడు. భారత్‌ ఎతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా ఎ జట్టకు కెప్టెన్​గా వ్యవహరించిన నాథన్ మెక్‌స్వీనేను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

వార్నర్ రిప్లేస్
స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలకడం వల్ల ఆసీస్​కు ఓపెనింగ్​ జోడీ కుదరడం లేదు. పలుమార్లు సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్​ను ట్రై చేసినా సరైన ఫలితం రాలేదు. ఆసీస్ బోర్డు ఓపెనింగ్ జోడీపై దృష్టి పెట్టింది. దీంతో యువ ఆటగాడు నాథన్ మెక్‌స్వీనేను ఎంపిక చేసింది. దాదాపు మెక్​స్వీనేనే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఓపెనింగ్​ బ్యాటర్​గా వచ్చే ఛాన్స్ ఉంది.

25 ఏళ్లు నాథన్ మెక్‌స్వీనే ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో కొంతకాలంగా ఆకట్టుకుంటున్నాడు. ఇందులో 2,252 పరుగులు చేశాడు. 6సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయికే చివరి 22 ఇన్నింగ్స్​లో 42.25 యావరేజ్​తో 845 పరుగులు చేశాడు. ఇందులోనే 8సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు.

భారత్​తో తొలి టెస్టుకు ఆసీస్​ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్‌ కుమార్, నవ్‌దీప్‌ సైని, ఖలీల్ అహ్మద్

అక్కడ వారిని ఓడించలేరు! - WTC ఫైనల్​ కాదు, ఫస్ట్ ఆ సిరీస్​పై ఫోకస్ పెట్టండి : గావస్కర్

'వాళ్లు రోహిత్ వీక్​నెస్​ తెలుసుకున్నారు!- బోర్డర్ గావస్కర్​లోనూ ఇలా జరిగితే ఇక అంతే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.