తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

జీన్స్​లు​​ తొందరగా పాడవుతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే ఎక్కువ కాలం కొత్తవాటిలా!​ - TIPS TO KEEP JEANS LONG LASTING

-ప్రస్తుత రోజుల్లో కామన్​ అయిన జీన్స్​ వాడకం -జీన్స్​ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఈ టిప్స్​ కంపల్సరీ!

Tips to Keep Jeans Long Lasting
Tips to Keep Jeans Long Lasting (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 10:04 AM IST

Tips to Keep Jeans Long Lasting: నేటి జనరేషన్​లో చిన్నపిల్లల నుంచి సీనియర్​ సిటిజన్స్​ వరకు అందరూ జీన్స్ ధరిస్తున్నారు. ఇదొక సింబల్ ఆఫ్ స్టైల్. ఇంటి నుంచి బయటికెళ్తే ఒంటి మీద జీన్స్ ఉండాల్సిందే. అందుకే చాలా మంది ఎక్కువ కాలం మన్నేలా బ్రాండెడ్​ జీన్స్​లు కొంటుంటారు. కానీ నెలలు తిరక్కుండానే అవి పాతబడిపోతుంటాయి. దాంతో వాటిని పక్కన పడేసి మరిన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలోనే జీన్స్​ ఎక్కువ కాలం మన్నేందుకు కొన్ని టిప్స్​ సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జీన్స్​లు ఎందుకు పాడవుతాయి?: ఇష్టపడి కొనుక్కున్న బ్రాండెడ్​ జీన్స్​లు​ తక్కువ సమయంలోనే పాతబడిపోవడానికి కారణం వాటిని సరిగ్గా ఉతక్కపోవడమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మిగిలిన దుస్తులతో పోలిస్తే, జీన్స్ మెటీరియల్ మందంగా ఉంటుంది. దాంతో వాటిని ఎక్కువసేపు నానబెట్టడం, బ్రష్‌తో గట్టిగా రుద్దడం లాంటివి చేస్తుంటారు. ఫలితంగా జీన్స్ చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం జరుగుతుంటాయని చెబుతున్నారు. ఇలా కాకుండా జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు.

ఈ టిప్స్​ పాటించాలి:

  • సాధారణంగా ఉతికిన బట్టల్ని తిరగేసి ఆరేయాలి. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. తిరగేయకుండా ఎండలో ఆరేయడం వల్ల అవి రంగు వెలిసిపోయి తొందరగా పాడవుతుంటాయి. జీన్స్‌ విషయంలో కూడా ఇది పాటించాలట. కాబట్టి జీన్స్‌ను ముందుగా ఉల్టా తీసి నానబెట్టి అలాగే ఉతికి ఆరేయాలని, అప్పుడే జీన్స్ రంగు మారకుండా ఉంటుందంటున్నారు.
  • మనం ఏ దుస్తులు కొన్నా వాటిని ఎలా ఉతకాలి? ఉతికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలన్నీ దుస్తుల లోపలి వైపు ఉన్న ఓ వైట్ లేబుల్‌పై రాసుంటుంది. వాటిని పాటించడం వల్ల ఆయా దుస్తులను కాపాడుకోవచ్చు. జీన్స్ విషయంలో కూడా ఇలాంటి సూచనలు ఉంటాయి. కాబట్టి లేబుల్​పై ఇచ్చిన సూచనలు పాటిస్తే జీన్స్​ పాడవకుండా/పాతబడకుండా జాగ్రత్తపడవచ్చు.
  • వాషింగ్ మెషీన్‌లో జీన్స్‌ని ఉతికే సమయంలో చాలా మంది హాట్​వాటర్​ వాష్‌ని ఎంచుకుంటారు. జీన్స్ బాగా శుభ్రమవుతుందనే భావనతోనే ఇలా చేస్తుంటారు. అయితే బాగా వేడిగా ఉండే నీళ్ల వల్ల డెనిమ్ పాడైపోయి చిరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే కోల్డ్ జెంటిల్ వాష్ ఆప్షన్‌ని ఎంచుకోవాలంటున్నారు.
  • డెనిమ్‌తో తయారైన వస్త్రాలను ఉతికిన తర్వాత వాటిని ఎండలో ఆరేస్తాం. దీనివల్ల జీన్స్ త్వరగా ఆరిపోతుంది. కానీ, వేడి ఎక్కువగా తగిలితే జీన్స్ ఫ్యాబ్రిక్ పాడైపోతుందని, రంగు కూడా వెలిసిపోతుందంటున్నారు. కాబట్టి వాటిని నీడలోనే ఆరేయాలని, దీనివల్ల మెటీరియల్ ఎక్కువ కాలం మన్నుతూ కొత్తదానిలా కనిపిస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా:

  • డెనిమ్ వస్త్రాలను డ్రైక్లీనింగ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు మన్నేలా చేసుకోవచ్చు.
  • కొంతమంది జీన్స్‌ని ఉతికేటప్పుడు బాగా శుభ్రపడతాయనే ఉద్దేశంతో బ్లీచ్ వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి కొన్ని రోజులకే రంగు కోల్పోయి పాతబడిపోతాయి.

జీన్స్​ వేసుకునే నిద్రపోతున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మీరు తినే దాల్చిన చెక్క చైనా నుంచి వచ్చిందా? - ఇలా కనిపెట్టండి!

ABOUT THE AUTHOR

...view details