ETV Bharat / offbeat

హోటల్ స్టైల్ "మంగోలియన్ చికెన్" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ ఆహా ఏమి రుచి అనాల్సిందే! - MONGOLIAN CHICKEN RECIPE

సండే స్పెషల్ వహ్వా అనిపించే మంగోలియన్ చికెన్ - నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

How to Make Mongolian Chicken
Mongolian Chicken Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 11:33 AM IST

Mongolian Chicken Recipe in Telugu : సండే వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో నాన్​వెజ్ ఘుమఘుమలు ఉండాల్సిందే. ఈ క్రమంలోనే మెజారిటీ పీపుల్ చికెన్​ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే, ఎప్పుడూ చికెన్​తో రొటీన్​గా ఫ్రై, కర్రీ, బిర్యానీ వంటివి తిని బోరింగ్​గా అనిపించొచ్చు. అందుకే ఈ సండే కాస్త డిఫరెంట్​గా ఏదైనా కొత్త రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఒక అద్దిరిపోయే నాన్​వెజ్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, హోటల్ స్టైల్ "మంగోలియన్ చికెన్". ఇది రొటీన్ కర్రీలను మించిన టేస్ట్​తో తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా దీన్ని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అర కిలో(బోన్​లెస్)
  • మొక్కజొన్నపిండి - అర కప్పు
  • వెల్లుల్లి తరుగు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - 1
  • మిరియాల పొడి - చెంచా
  • ఉల్లికాడలు - 2
  • సోయా సాస్ - 2 టేబుల్​స్పూన్లు
  • హొయిసిన్ సాస్ - 2 టేబుల్​స్పూన్లు
  • ఒయస్టర్‌ సాస్‌ - 1 టేబుల్‌స్పూన్
  • చక్కెర - చెంచా
  • ఆయిల్ - తగినంత

బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చికెన్​ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి. అలాగే, ఉల్లిపాయ, ఉల్లికాడలను తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో చికెన్, మొక్కజొన్నపిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి అరగంటపాటు అలా వదిలేయాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగు, ఉల్లికాడల ముక్కలను వేసుకొని మరికాసేపు వేయించుకోవాలి.
  • ముక్కలు మెత్తగా అయ్యాక ఆ మిశ్రమంలో హొయిసిన్‌ సాస్, సోయా సాస్, ఒయస్టర్‌ సాస్, ఎండుమిర్చి, చక్కెర, ఉప్పు యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించి దింపేసుకుంటే సరిపోతుంది. అనంతరం వడ్డించేటప్పుడు ఇంకాస్త ఉల్లికాడల తరుగు చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే "మంగోలియన్ చికెన్" రెడీ!
  • మరీ, నచ్చిందా అయితే మీరూ ఈ సండే మంగోలియన్ చికెన్​ కర్రీని ట్రై చేయండి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఎంతో రుచికరంగా ఉండే ఈ రెసిపీని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "చికెన్ మలై టిక్కా" - ఇంట్లోనే సులువుగా చేసేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.