Tips to getting Ready Kids on Christmas : ఏసుక్రీస్తు జననాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇళ్లను అందంగా ముస్తాబు చేసుకుంటారు. క్రిస్మస్ ట్రీ, ఇంటిపైన స్టార్ సింబల్స్ పెట్టి డెకరేట్ చేసుకుంటారు. ఇంకా చాలా మంది చర్చ్‌కు వెళ్లి ప్రార్థనలు చేయడంతోపాటు ఇంటికి స్నేహితులను పిలిచి కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో కేకులు కట్ చేసి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
ఇక ఈ పండగలో సందడంతా పిల్లలదే. శాంతా క్లాజ్ తాతా వచ్చి గిఫ్ట్‌లు ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. మరికొద్దిమంది పేరెంట్స్ తమ పిల్లలను శాంతాక్లాజ్లుగా, దేవదూతలుగా రెడీ చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు గిఫ్ట్‌లు అందిస్తారు. మరి మీరు కూడా ఈ పండగ వేళ మీ పిల్లలను రెడీ చేయాలనుకుంటున్నారా? అందుకోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. ఈ టిప్స్ ఫాలో అవుతూ రెడీ చేస్తే అందరూ వావ్ అంటారు.
డ్రెస్ సెలక్షన్: క్రిస్మస్ అంటేనే కొత్త బట్టలు. ముఖ్యంగా క్రిస్మస్ థీమ్‌కు సరిపడే విధంగా డ్రెస్‌లు సెలెక్ట్ చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల కోసం ఇలాంటివే తీసుకోవాలి. ముఖ్యంగా శాంతాక్లాజ్ డ్రెస్ అయిన ఎరుపు, తెలుపు రంగులకు దగ్గరగా ఉండేలా ఎంచుకోవాలి. లేదా క్రిస్టమస్ ట్రీ ఉండే గ్రీన్ కలర్లో ఎంచుకున్నా బాగానే ఉంటుంది. అలాగే స్నో మ్యాన్ ఉన్న స్వెటర్ కూడా బాగా సరిపోతుంది. ఇక ఆడపిల్లలకైతే ఏంజెల్స్‌ను పోలి ఉండేలా వైట్ గౌన్, వింగ్స్ కూడా సెలక్ట్ చేస్తే సూపర్ అంటారు.
హెయిర్ స్టైల్: క్రిస్మస్ థీమ్‌కు తగిన డ్రెస్ వేసిన తర్వాత చాలా మంది పిల్లలకు ఏవేవో హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తుంటారు. దీంతో వారి లుక్ పోతుంది తప్పించి మంచిగా ఉండదంటున్నారు. వారి హెయిర్‌ను నేచురల్‌గా ఉంచి.. దానిపై శాంతా ధరించే క్యాప్ పెట్టండి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల డిజైన్లు, ఆకారాల్లో శాంతాక్లాజ్ టోపీలు లభిస్తున్నాయి. వాటిని పెట్టవచ్చు. ఇక ఏంజెల్స్లా రెడీ అయినా ఆడపిల్లలకు ప్రిన్సెస్ కిరిటాలు కూడా ఉంటాయి. వాటిని పెట్టవచ్చు. వీటిని ధరించిన తర్వాత మీ పిల్లల క్యూట్ నెస్ మరింత పెరుగుతుంది.