తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కేక్స్, పఫ్స్ ఇంట్లో చేసినప్పుడు సరిగ్గా రావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే పర్​ఫెక్ట్​గా రావడమే కాదు టేస్ట్ అదుర్స్! - BEST TIPS FOR PERFECT BAKING

బేకింగ్ రెసిపీలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి - పర్​ఫెక్ట్​గా వస్తాయంటున్న కుకింగ్ ఎక్స్​పర్ట్స్!

BAKING TIPS FOR BEGINNERS
Perfect Baking Tips (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 5:01 PM IST

Best Tips and Tricks for Perfect Baking :ప్రస్తుత రోజుల్లో చాలా మంది పఫ్స్, బ్రెడ్, కేక్స్, కుకీస్ వంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కొంత మంది పిల్లలు అడిగినప్పుడల్లా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే అలాంటి వాటిని ప్రిపేర్ చేసి ఇస్తుంటారు. కానీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చాలా మందికి బయటి మాదిరిగా టేస్టీగా, పర్​ఫెక్ట్​గా రావు. అయితే అలా రాకపోవడానికి వాటిని తయారు చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కారణం కావొచ్చంటున్నారు కుకింగ్ ఎక్స్​పర్ట్స్. అలాంటి వంటకాల్ని తయారు చేసేటప్పుడు కొన్ని టిప్స్ దృష్టిలో ఉంచుకుంటే పదార్థం పర్‌ఫెక్ట్‌గా రావడమే కాదు, దాని రుచీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ఏదైనా ఒక రెసిపీ పర్‌ఫెక్ట్‌గా కుదరాలంటే అందులో వాడే పదార్థాల కొలతలు చాలా ముఖ్యం. బేకింగ్‌ ఐటమ్స్‌కూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఇక ఇందుకోసం ఆయా పదార్థాల్ని కొలిచే కప్స్‌, స్పూన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడటం బెటర్. వీలైతే వీటికి బదులుగా డిజిటల్ వెయింగ్ స్కేల్‌ను యూజ్ చేస్తే ఇంకా మంచిదంటున్నారు.
  • కొందరు పొడి పదార్థాల్ని జల్లెడ పట్టకుండానే ఉపయోగిస్తుంటారు. మీరు చేసే ఈ చిన్న పొరపాటు వల్ల కూడా వంటకం కుదరకపోయే ఛాన్సెస్ ఉంటాయంటున్నారు. అందుకే జల్లెడ పట్టే స్టెప్‌ను స్కిప్ చేయకపోవడం బెటర్ అంటున్నారు.
  • అలాగే కొంత మంది పొడి పదార్థాల్ని కొలిచేటప్పుడు కప్పు/ స్పూన్‌ నిండుగా తీసుకోవడం చేస్తుంటారు. అదే తడి పదార్థాల్ని ఇలా కొలవలేం. కాబట్టి ఏ పదార్థమైనా స్పూన్/ కప్పు అంచుల వరకు కొలిచి తీసుకుంటే రెసిపీ పర్‌ఫెక్ట్‌గా వస్తుందంటున్నారు. లేదంటే కొలతల్లో తేడా వచ్చి రెసిపీ సరిగ్గా కుదరకపోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
  • అదేవిధంగా తడి, పొడి పదార్థాల్ని కొలవడానికి వేర్వేరు కప్స్‌/ స్పూన్స్‌ యూజ్ చేయాలి. అప్పుడే పదార్థం కోసం కచ్చితమైన కొలతల్ని తీసుకోగలుగుతామంటున్నారు.
  • సాధారణంగా తడి, పొడి పదార్థాల్ని కలిపేటప్పుడు పిండి మిశ్రమంలో ముద్దలు ఏర్పడటం కామన్. అయితే అవి ఏర్పడకుండా ఉండాలంటే పొడి పిండిలో తడి పదార్థాల్ని కొద్దికొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తుండాలి. ఫలితంగా కేక్స్, కప్‌ కేక్స్‌ వంటివి సాఫ్ట్​గా వస్తాయని చెబుతున్నారు
  • ఇకపోతే కొందరు బేకింగ్‌ చేసే వంటకం మృదువుగా రావాలన్న ఉద్దేశంతో పిండి మిశ్రమాన్ని పదే పదే ఎక్కువసేపు కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అందులోని గ్లూటెన్‌ శాతం పెరిగి కుకీస్‌ వంటి వంటకాలు గట్టిగా వస్తాయంటున్నారు. సో పిండి కలిపేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి.
  • బేకింగ్‌ వంటకాల్లో తేనె, మేపుల్‌ సిరప్‌, నెయ్యి వంటి చిక్కటి పదార్థాల్ని యూజ్ చేస్తుంటాం. అయితే వాటిని కొలిచి తీసుకునేటప్పుడు ఆయా కప్పులు/ స్పూన్ల అంచులకు అవి అంటుకుపోతుంటాయి. ఫలితంగా కొలత సరిగ్గా రాదు. ఈ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే ముందు కొలతల స్పూన్లు/ కప్పుల లోపలి భాగంలో నాన్‌స్టిక్‌ కుకింగ్‌ స్ప్రేను స్ప్రే చేస్తే సరిపోతుందంటున్నారు.
  • కొన్నిసందర్భాల్లో బేకింగ్‌ వంటకంలో వాడే అన్ని పదార్థాలూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి టైమ్​లో చాలా మంది వాటిని స్కిప్ చేసి రెసిపీ ప్రిపేర్ చేస్తుంటారు. దీనివల్ల కూడా వంటకం కచ్చితంగా కుదరకపోవచ్చంటున్నారు. అందుకే ఆయా వంటకాలకు కావాల్సిన పదార్థాలన్నీ సమకూర్చుకున్నాకే తయారీ ప్రారంభించడం మంచిదని చెబుతున్నారు.
  • అదేవిధంగా మీరు చేసే వంటకం గురించి తెలుసుకోవడానికి పుస్తకంలో చదివినా, యూట్యూబ్‌లో చూసి చేసినా, దానికి సంబంధించిన తయారీ విధానం అందులో చెప్పినట్లుగానే కచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాకాకుండా మధ్యమధ్యలో మీ సొంత ప్రయోగాలు చేస్తే వంటకం పర్‌ఫెక్ట్‌గా కుదరకపోయే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details