తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

విదేశీ అందాలు మన దేశంలోనే - ఫారిన్ ట్రిప్​ ఫీలింగ్​ కలిగించే ప్రాంతాలివే! - FOREIGN VIBES IN INDIA

ఇండియాలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు - విదేశాల్లో ఉన్నట్టుగానే ఫీలవుతారు!

FOREIGN VIBES IN INDIA
FOREIGN PLACES IN INDIA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 4:07 PM IST

Foreign Vibes in India :మనలో చాలా మందికి ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలను చుట్టిరావాలని ఉంటుంది. కానీ, విదేశాలకు వెళ్లి రావాలంటే డబ్బుతో కూడుకున్న పని. అలాగే పాస్​పోర్ట్, వీసా వంటివి కూడా కావాలి. ఇలా వివిధ కారణాల వల్ల చాలా మంది విదేశీ టూర్​లకు వెళ్లలేకపోతుంటారు. కానీ, మీకు తెలుసా? ఇండియాలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిని చుట్టొస్తే ఫారిన్ ట్రిప్ వెళ్లిన అనుభూతి పొందవచ్చంటున్నారు నిపుణులు. ఆ టూరిస్ట్ ప్లేస్​లలో విహరిస్తుంటే విదేశాల్లో తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు. మరి, ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఖజ్జియార్ :హిమాచల్ ప్రదేశ్​లో ఉన్న ఈ పర్యాటక ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తారు. చంబా జిల్లాలోని డల్హౌసీకి సమీపంలో ఖజ్జియార్ ఒక హిల్ స్టేషన్. దట్టమైన దేవదారు అడవులు, విశాలమైన పచ్చికబయళ్లు, చిన్న చిన్న నీటి ప్రవాహాలు, మంచు కొండలతో కూడిన ఈ ప్రాంతం మొత్తం స్విట్జర్లాండ్‌ని పోలి ఉంటుంది. అందుకే స్విట్జర్లాండ్ వెళ్లలేని వారు ఇక్కడికి వెళ్లొస్తే ఎన్నో మరపురాని అనుభవాలను సొంతం చేసుకోవచ్చు.

అలెప్పీ :అలప్పుజ అని కూడా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని "తూర్పు వెనిస్"​గా పేర్కొంటారు. ఇది కేరళలోని ఒక అందమైన టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ప్రవహించే పచ్చని కాలువలు, సరస్సులు, బ్యాక్ వాటర్స్, బీచ్​లు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. కాబట్టి, మీరు అలెప్పీ చూసొస్తే తూర్పు వెనిస్ అందాలను చూసిన ఫీల్ పొందవచ్చు.

చిత్రకూట్ జలపాతం : మీరు ఇండియాలో సందర్శించాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం చిత్రకూట్ జలపాతం. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ప్రాంతాన్ని "ఇండియన్ నయాగరా వాటర్​ఫాల్స్"​గా పిలుస్తారు. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటి ప్రవాహాలు పర్యాటకుల్ని వావ్ అనిపిస్తాయి. ఉత్తర అమెరికాలోని జలపాతాలను గుర్తుకు తెస్తోంది ఈ ప్రాంతం!

కూర్గ్ :సుందరమైన కాఫీ తోటలు, పొగమంచుతో కప్పి ఉన్న కొండలు అందమైన జలపాతాలు చూడాలంటే స్కాట్లాండ్‌కి వెళ్లక్కర్లేదు. కర్ణాటకలోని కూర్గ్​కివెళ్లినా చాలు. అందుకే దీన్ని "స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా"గా పిలుచుకుంటారు. కాబట్టి, చల్లని వాతావరణంలో స్కాటిష్ హైలాండ్స్ అందాన్ని కోరుకునే వారు ఇక్కడికి వెళ్లినా మంచి అనుభూతిని పొందవచ్చు.

అండమాన్ దీవులు : ఇండియాలోని మరో అందమైన ప్రదేశం అండమాన్. ఇక్కడి బీచ్​లు థాయిలాండ్‌లోని ఫై ఫై దీవుల అందాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ప్రాంతంలోని శక్తివంతమైన పగడపు దిబ్బలు, స్కూబా డైవింగ్ వంటి కార్యకలాపాలు థాయిలాండ్ వెళ్లొచ్చిన ఫీల్​ని అందిస్తాయి.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ :ఇది ఉత్తరాఖండ్​లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఈ అందమైన లోయలో వివిధ రంగుల్లో పూసే పుష్పాలుటూరిస్ట్​ను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. దీన్ని సందర్శించారంటే అమెరికాలోని ఫేమస్ ఆంటీలోప్‌ వ్యాలీకి వెళ్లిన అనుభూతిని పొందవచ్చు. అందుకే ఈ ప్రాంతాన్ని "ఆంటీలోప్‌ వ్యాలీ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తారు.

లక్షద్వీప్ :మాల్దీవులకు వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి వారు ఇండియాలోని లక్షద్వీప్ వెళ్లినా మరపురాని అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే మాల్దీవులు, మారిషస్​లో ఉండే బీచ్‌ల మాదిరే ఇక్కడ కూడా క్రిస్టల్ క్లియర్ వాటర్ బీచ్‌లుంటాయి.

థార్ ఎడారి :రాజస్థాన్​లోని థార్ ఎడారి కూడా ఇండియాలో తప్పక వెళ్లాల్సిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి విశాలమైన గోల్డెన్ డ్యూన్స్ ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారిని పోలి ఉంటాయి. అందుకే దీన్ని "సహారా ఆఫ్ ఇండియా"గా పిలుస్తారు. ఒంటె సఫారీలు, సాంప్రదాయ రాజస్థానీ ప్రదర్శనలు ఇలా ఎన్నో పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు విదేశీ పర్యటనకు వెళ్లకపోతే ఇండియాలోని ఈ ప్రాంతాలను సందర్శించి మంచి అనుభూతిని పొందండి.

ఇవీ చదవండి :

వీకెండ్‌కు సూపర్‌ ఛాయిస్ - విహార యాత్రకు తెలంగాణలోని బ్లాక్‌ బెర్రీ ఐలాండ్​ ఆహ్వానం!

ఒక్కరోజులోనే 'అరకు' అందాలన్నీ చూసేయండి - రూ.2 వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details