ETV Bharat / offbeat

రేషన్​ బియ్యంతో 'ఇడ్లీ రవ్వ' - ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోండిలా! - ఇడ్లీలు సాఫ్ట్​గా వస్తాయి! - HOW TO MAKE IDLI RAVA AT HOME

- ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ రవ్వతో సూపర్​ సాఫ్ట్​ ఇడ్లీలు - ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ చేసుకుంటే నెలల పాటు నిల్వ!

How to Make Idli Rava at Home
How to Make Idli Rava at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 4:43 PM IST

How to Make Idli Rava at Home : ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్​ఫాస్ట్​లలో ఇడ్లీ ఫస్ట్​ ప్లేస్​లో ఉంటుంది. అందుకే చాలా మంది రెగ్యులర్​గా వీటిని చేసుకుని తింటుంటారు. వారంలో కనీసం రెండు మూడు రోజులైనా సరే ఇడ్లీ చేయాల్సిందే. అయితే ఇడ్లీ తయారు చేయాలంటే మినపప్పు ఎంత అవసరమో, ఇడ్లీ రవ్వ అంతకుమించి. అందుకే చాలా మంది మార్కెట్​కు వెళ్లినప్పుడు ఇడ్లీ రవ్వ ఎక్కువ మొత్తంలో కొని తీసుకొస్తుంటారు. అయితే ఈసారి ఇడ్లీలు చేసేటప్పుడు ఇడ్లీ రవ్వను బయట కొనకుండా, ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోండి. అది కూడా రేషన్​ బియ్యంతో. ఏంటి రేషన్​ బియ్యంతో ఇడ్లీ రవ్వ అని ఆలోచిస్తున్నారా? నిజమే, కంట్రోల్​ రైస్తో​ ఇడ్లీ రవ్వను ఈజీగా చేసుకోవచ్చు. ఈ రవ్వతో ఇడ్లీలు సాఫ్ట్​గా వస్తాయి. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • రేషన్​ బియ్యం - రెండు కప్పులు(అర కేజీ)
  • నీళ్లు - 8 కప్పులు
  • ఉప్పు - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • రేషన్​ బియ్యాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. అంటే అందులో రాళ్లు, మట్టి పెళ్లలు లేకుండా జల్లించి క్లీన్​ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి శుభ్రం చేసిన రేషన్​ బియ్యం తీసుకుని ఓ రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పెద్ద గిన్నె పెట్టి అందులో 8 కప్పుల నీరు పోసి హై ఫ్లేమ్​ మీద మరిగించాలి. అయితే ఇక్కడ మీరు బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో నీళ్లు కొలుచుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు. ఇక్కడ రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి.
  • నీరు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసి కలిపి ఓ నిమిషం పాటు ఉంచి స్టవ్​ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టాలి.​ ఎక్కువసేపు అయితే బియ్యం ఉడుకుతుంది. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాల సేపు వదిలేయాలి.
  • 10 నిమిషాల తర్వాత నీటిని వడకట్టుకోవాలి.అందుకోసం ఓ గిన్నెలో జల్లెడ పెట్టి, అందులో ఓ కాటన్​ క్లాత్​ వేయాలి. ఆ తర్వాత అందులోకి బియ్యాన్ని ఒంపుకోవాలి. ఆపై చల్లని నీళ్లు పోసి గట్టిగా పిండుకోవాలి.
  • ఇలా నీళ్లు లేకుండా వడకట్టిన బియ్యాన్ని ఎండబెట్టాలి. బాగా ఎండ ఉంటే ఓ రోజంతా, ఎండ మామూలుగా ఉంటే రెండు రోజుల పాటు బియ్యాన్ని ఎండబెట్టుకోవాలి. బియ్యం నమిలితే కరకరలాడాలి. ఒకవేళ రైస్​ సరిగా ఆరక తడిగా ఉంటే ఇడ్లీ రవ్వ ముక్కవాసన వస్తుంది. కాబట్టి బియ్యాన్ని వీలైనంత వరకు బాగా ఎండబెట్టుకోవాలి.
  • బాగా ఎండిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీజార్​లోకి కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ ఆపి ఆపి గ్రైండ్​ చేసుకోవాలి. అలా గ్రైండ్​ చేసుకున్న రవ్వను జల్లించుకుని ఎయిర్​టైట్​ కంటైనర్లో పెట్టి స్టోర్​ చేసుకుంటే సుమారు 4 నెలల పాటు తాజాగా ఉంటుంది.​ అయితే ఇక్కడ అరకేజీ బియ్యం మాత్రమే కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తం తయారు చేసుకోవాలనుకుంటే మిల్లు దగ్గర రవ్వ లాగా పట్టించుకోవడం మంచిది.
  • ఇలా తయారు చేసుకున్న రవ్వను మినపప్పుతో కలిపి ఇడ్లీలు చేసుకుంటే సరి. సూపర్​ టేస్ట్​తో పాటు సాఫ్ట్​గా వస్తాయి.

పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్​ అద్దిరిపోతాయి!

టిఫెన్ సెంటర్​ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.