తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అలా "సోమశిల" చూసొద్దామా - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీ - పైగా శ్రీశైలం చూడొచ్చు! - TELANGANA TOURISM SOMASILA PACKAGE

-బడ్జెట్​ ధరలోనే రెండు రోజుల ప్యాకేజీ -ఫ్యామిలీతో కలిసి సూపర్​గా ఎంజాయ్​ చేయవచ్చు

Telangana Tourism Somasila Package
Telangana Tourism Somasila Package (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 2:09 PM IST

Telangana Tourism Somasila Package: నేటి బిజీ బిజీ లైఫ్​లో.. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ఫ్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్​ దగ్గర్లో ఉండే టూరిస్టు స్పాట్‌ల కోసం వెతుకుతుంటారు. అలా నగరానికి దగ్గరగా ఉండే టూరిస్టు స్పాట్‌లలో తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుగాంచిన సోమశిల ఒకటి. నగరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకలు క్యూ కడుతుంటారు. మరి మీరు కూడా సోమశిల వెళ్లి ఎంజాయ్​ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​ న్యూస్​ చెబుతోంది తెలంగాణ టూరిజం. సోమశిల అందాలను చూసేందుకు వీలుగా ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తెలంగాణ టూరిజం "హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్(రోడ్​ కమ్​ రివర్​క్రూజ్​ టూర్​)​"​ పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ టూర్​ ఉంటుంది. మొత్తం రెండు రోజుల పాటు ఈ టూర్​ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ నుంచి బస్సు ద్వారా జర్నీ ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం​ నుంచి శ్రీశైలానికి బస్సు జర్నీ స్టార్ట్​ అవుతుంది. శ్రీశైలం చేరుకొని హోటల్‌లో చెకిన్‌ అవుతారు.
  • ఆ తర్వాత శ్రీభమరాంభ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం ఉంటుంది. ఆ సాయంత్రం వీలుంటే డ్యామ్​ సందర్శన ఉంటుంది. ఇక ఆ రాత్రికి శ్రీశైలంలో బస చేయాల్సి ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు ప్రయాణమవుతారు. అయితే ఇక్కడ జర్నీ శ్రీశైలం నుంచి సోమశిల వరకు క్రూజ్​ జర్నీ(బోట్​) ఉంటుంది. ఇక సాయంత్రం వరకు అక్కడ ఎంజాయ్​ చేస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రి 9 గంటలకు భాగ్యనగరానికి చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ఇతర వివరాలు చూస్తే:

  • రెండు రోజుల ఈ టూర్​ కోసం పెద్దలకు రూ.4999, పిల్లలకు 3,600గా ప్యాకేజీ ధరలు నిర్ణయించారు.
  • హైదరాబాద్​ నుంచి నాన్​ ఏసీ బస్సు ద్వారా జర్నీ ఉంటుంది.
  • శ్రీశైలంలో నాన్​ ఏసీ హోటల్​లో రాత్రికి బస ఉంటుంది.
  • శ్రీశైలం నుంచి సోమశిలకు నాన్​ ఏసీ బోట్​ జర్నీ
  • బోట్​ జర్నీలో మధ్యాహ్న భోజనం అందిస్తారు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details