How to Make Tamilnadu Style Vada Curry:ఇడ్లీ, దోశ, వడ, పూరీ.. ఇలా బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా మెజారిటీ జనం వీటికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ పల్లీ చట్నీ తినాలంటే బోర్ కొడుతుంది. పోనీ వేరేది ఏమైనా చేయాలన్నా ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి. మరి మీరు కూడా బ్రేక్‌ఫాస్ట్‌లోకి పల్నీ చట్నీతో విసిగిపోయారా? అయితే మీకోసం ఓ సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే తమిళనాడు స్టైల్ వడ కర్రీ. ఈ కర్రీ ఉంటే ఒకటి తినే దగ్గర మరో రెండు ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. పైగా దీని కోసం ఏవేవో పదార్థాలు అవసరం లేదు. చేయడం కూడా వెరీ సింపిల్. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- వడ కోసం:
- పచ్చి శనగపప్పు - 1 కప్పు
- పసుపు - పావు టీ స్పూన్
- సోంపు - అర టీ స్పూన్
- ఉప్పు- పావు చెంచా
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
కర్రీ కోసం:
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- దాల్చిన చెక్క - 1
- బిర్యానీ ఆకు - 1
- లవంగాలు - 3
- యాలకులు - 3
- ఎండు మిర్చి - 2
- ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
- కరివేపాకు రెబ్బలు - 2
- పచ్చిమిర్చి చీలికలు - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్
- పండిన టమాటలు - 2
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు - అర లీటర్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- మటన్ మసాలా - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఓ రెండు గంటలు నానబెట్టాలి. వీలైతే రాత్రంతా నానబెట్టినా ఏం కాదు.
- ఇలా నానిన శనగపప్పును నీళ్లు లేకుండా వడకట్టి మిక్సీజార్‌లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పసుపు, సోంపు వేసి నీరు పోయకుండా గట్టిగా, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని ఉప్పు కలిపి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని చేత్తో చిన్న చిన్నగా నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఎర్రగా వేయించి పక్కన పెట్టాలి. పిండి మొత్తాన్ని ఇలానే చేసి పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడిక్కిన తర్వాత దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి.
- ఆ తర్వాత ఎండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అనంతరం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత బాగా పండిన టమాట ముక్కలు, ధనియాల పొడి, కారం వేసి వేసి
- టమాట ముక్కల పై తోలు ఊడే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి.
- అనంతరం అర లీటర్ నీరు పోసి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఓ 8 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన శనగపప్పు మిశ్రమాన్ని వేసి ఓ నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఆ తర్వాత అందులోకి కొత్తిమీర తరుగు, మటన్ మాసాలా వేసి కలపాలి. ఒకవేళ మటన్ మసాలా లేనివారు గరం మసాలా వాడుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా, బ్రేక్‌ఫాస్ట్‌లోకి సెట్ అయ్యే వడ కర్రీ రెడీ.
మటన్ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు
ఎన్నో పోషకాలున్న మఖానాతో "టేస్టీ మసాలా కర్రీ"- ఇలా చేస్తే రుచి అద్దిరిపోతుంది!!
ఆహా అనిపించే "ఆఫ్ఘాని ఎగ్ మసాలా"- సూపర్ టేస్టీ రెసిపీ - ఇంట్లో ఈజీగా చేసేయండి!