తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

స్ట్రీట్​ స్టైల్ "వెజ్​ ఫ్రైడ్​ రైస్​" - పిల్లలు మళ్లీ కావాలంటారు! - VEG FRIED RICE IN TELUGU

-10 నిమిషాల్లోనే కమ్మటి ఫ్రైడ్​ రైస్​ - ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

Street Style Veg Fried Rice
Street Style Veg Fried Rice (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 5:25 PM IST

Street Style Veg Fried Rice : చాలా మందికి ఫ్రైడ్​ రైస్​ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో రాత్రి అన్నం మిగిలిపోయినా.. నిమిషాల్లోనే లంచ్​ బాక్స్​ రెడీ అయిపోవాలన్నా.. ఎక్కువ మంది ఫ్రైడ్​ రైస్​ చేసేస్తుంటారు. అయితే.. ఇంట్లో ఎప్పుడూ తాలింపు అన్నం ఒకేలా చేసి పెడితే ఇష్టంగా తినరు. అలా కాకుండా ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా టేస్టీగా "వెజ్​ ఫ్రైడ్​ రైస్"​ చేసేయండి. ఇక్కడ చెప్పిన విధంగా ఫ్రైడ్​ రైస్​ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. అలాగే తక్కువ టైమ్​లో చేసినా టేస్ట్​ మాత్రం అద్దిరిపోతుంది. ఈ రైస్​ లంచ్​ బాక్స్​లోకి పర్ఫెక్ట్​గా సెట్​ అవుతుంది. మరి, ఆలస్యం చేయకుండా.. సింపుల్​గా వెజ్​ ఫ్రైడ్​ రైస్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటీ ? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం-ఒకటిన్నర గ్లాసు
  • క్యారెట్​-1
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-2
  • నూనె- సరిపడా
  • ఉప్పు-రుచికి సరిపడా
  • బీన్స్​-5
  • కారం-టీస్పూన్​
  • ధనియాల పొడి-టీస్పూన్
  • మిరియాలపొడి-అరటీస్పూన్
  • సోయా సాస్-టేబుల్​స్పూన్
  • వెనిగర్-టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-టీస్పూన్

తయారీ విధానం :

  • ముందుగా ఒక రెండుసార్లు బియ్యాన్ని కడగండి. ఆపై రైస్​ ఉడికించుకోవడం కోసం స్టౌ పై గిన్నె పెట్టండి. ఇందులో 3 గ్లాసుల నీరు, కొద్దిగా నూనె, ఉప్పు వేయండి.
  • నీరు బాగా మరుగుతున్నప్పుడు రైస్​ వేసి.. అన్నం పొడిపొడిగా వండుకోండి.
  • ఇప్పుడు రెసిపీలోకి క్యారెట్​, బీన్స్​, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఆపై వెజ్​ ఫ్రైడ్​ రైస్ చేయడానికి స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో 3 టేబుల్​స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
  • ఇవి వేగిన తర్వాత స్టౌ హై ఫ్లేమ్​లో పెట్టి క్యారెట్​, బీన్స్ ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
  • ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. అనంతరం పొడిపొడిగా ఉడికించుకున్న అన్నం వేసి మిక్స్ చేయండి.
  • ఆపై కారం, ధనియాల పొడి, మిరియాలపొడి, ఉప్పు వేసుకుని బాగా కలపండి.
  • మసాలాలు రైస్​కి పట్టిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసి కలపండి. స్టౌ ఆఫ్​ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకుని మిక్స్ చేయండి.
  • అంతే ఇలా చేస్తే టేస్టీ వెజ్​​ ఫ్రైడ్​ రైస్​ మీ ముందుంటుంది. నచ్చితే ఈ విధంగా ఫ్రైడ్​ రైస్​ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయండి.

లంచ్​ బాక్స్ స్పెషల్​ కమ్మటి "ఉసిరికాయ అన్నం" - 10 నిమిషాల్లోనే సిద్ధం చేయండిలా!

లంచ్ బాక్స్ స్పెషల్ : హెల్దీ అండే టేస్టీ "పాలక్ పులావ్" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details