తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దేశంలో నత్తలాగా నడిచే ఏకైక రైలు ఇదే - గమ్యస్థానం చేరడానికి 37 గంటలు - అదే ఎక్కుతామంటున్న ప్రయాణికులు! - SLOWEST TRAIN IN INDIA

- 1910 కిలోమీటర్లు ప్రయాణించే "హౌరా-అమృత్‌సర్ మెయిల్"

Slowest Train
Slowest Train (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 1:41 PM IST

Slowest Train in India:మన దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేవ్యవస్థ పనిచేస్తోంది. పాసింజర్‌ రైళ్లు మొదలు.. అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్‌ వరకూ అనేక రకాల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. మెజార్టీ జనాలు కూడా రైలు ప్రయాణాలనే ఎంచుకుంటారు. ఇక తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అయితే చెప్పక్కర్లేదు. పండగలు, ఏదైనా ప్రత్యేక సమయాలల్లో ట్రైన్​ టికెట్లకు ఫుల్​ డిమాండ్​ ఉంటుంది.

అయితే.. మనదేశంలో ఎన్నో రైళ్లు సూపర్​ ఫాస్ట్​గా నడుస్తాయి. చాలా వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే.. ఫాస్ట్​గా నడిచే రైల్లే కాదు.. అత్యంత నెమ్మదిగా నడిచే రైలు కూడా ఒకటి ఉంది! ఆ రైలు దాదాపు 57 స్టేషన్‌లలో ఆగుతూ.. 37 గంటలకు గానీ గమ్యస్థానానికి చేరుకోదు. ఇంత నెమ్మదిగా ఈ రైలు ప్రయాణించినా.. ఈ ట్రైన్​ టికెట్లకు మాత్రం భారీ డిమాండ్‌ ఉంటుందట. ఇంతకీ ఆ రైలు ఏంటో? దాని ప్రత్యేకతలు ఈ స్టోరీలో చూద్దాం..

దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే ఆ రైలు పేరు.. "హౌరా-అమృత్‌సర్ మెయిల్ (13005)". ఇది దేశంలో అత్యధిక స్టాప్‌లు కలిగి ఉన్న ట్రైన్. ఈ రైలు (పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌) ఐదు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. వారణాసి, లఖ్​నవూ, కాన్పూర్, వంటి ప్రధాన స్టేషన్​లను కలుపుతూ వెళుతుంది. అయితే.. పెద్ద స్టేషన్‌లలో కాస్త ఎక్కువ సేపు ఆగే ఈ రైలు.. చిన్న స్టేషన్‌లలో మాత్రం ఒకటీ రెండు నిమిషాలకు మించి ఆగదు. ఈ రైలుకు పశ్చిమ బెంగాల్​లోని హౌరా నుంచి పంజాబ్​లోని అమృత్‌సర్ వరకు చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 1,910 కిలోమీటర్లు. ఈ దూరాన్ని చేరుకోవడానికి 37 గంటల సమయం పడుతుంది.

బ్లూ, రెడ్‌, గ్రీన్ - రైల్‌ కోచ్‌ల కలర్​కు ప్రత్యేక కారణం! రంగు బట్టి లగ్జరీలో తేడా!

డిమాండ్​ ఎక్కువేనండోయ్​: ఇంత నిదానంగా నడిచినా.. ఈ రైలుకు ఉన్న డిమాండ్​ ఎక్కువే. ఎక్కువ ప్రాంతాలను కవర్‌చేస్తూ ఈ రైలు నడుస్తుండటంతో ప్రయాణికులు దీనికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ రైలులో టికెట్‌ ధరల విషయానికొస్తే.. స్లీపర్ క్లాస్ రూ.695, థర్డ్ ఏసీ రూ. 1,870, రూ. సెకండ్ ఏసీ రూ.2,755, ఫస్ట్ ఏసీకి రూ.4,835గా ఉన్నాయి.

టైమింగ్స్​ ఇలా ఉంటాయి:ఇది హౌరా స్టేషన్ నుంచి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది. మళ్లీ అమృత్‌సర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 7.30 గంటలకు హౌరా స్టేషన్‌కు చేరుకుంటుంది. అంటే దగ్గరదగ్గర హౌరా నుంచి అమృత్​సర్​ వెళ్లాలంటే ఒకటిన్నర రోజులు రైలులోనే ప్రయాణం చేయాలి.

రైల్వే అడ్వాన్స్​ రిజర్వేషన్ టైమ్​ ఇకపై 60 రోజులే- టికెట్​ బుకింగ్​ రూల్స్​ ఛేంజ్​

దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details