ETV Bharat / offbeat

కూల్​డ్రింక్ మిగిలితే పారబోస్తున్నారా? - దాని ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు! - HOW TO USE LEFTOVER COOL DRINKS

- మిగిలిన కూల్​డ్రింక్స్​ను ఇలా వాడొచ్చు - ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్న నిపుణులు

How to use Leftover Cool Drinks
How to use Leftover Cool Drinks (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

How to use Leftover Cool Drinks: కూల్​డ్రింక్స్​.. ఈ పేరుకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫంక్షన్స్​ అయినా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో పార్టీలైనా, ఇంటికి అతిథులు వచ్చినా.. అందరికీ ఇవి గుర్తుకువస్తాయి. అయితే.. ఎప్పుడు తాగడానికి కూల్​డింక్స్ తెచ్చుకున్నా కొన్ని సందర్భాల్లో అందులో ఎంతో కొంత డ్రింక్ మిగులుతుంది. దీంతో ఆ మిగిలిన దానిని తర్వాత తాగడానికి ఇంట్రస్ట్ చూపించరు.​ ఎందుకంటే ఒకసారి బాటిల్​ ఓపెన్​ చేసినప్పుడు దానిలోని గ్యాస్ అయిపోతుంది. దీంతో ఆ డ్రింక్​ రుచి లేకుండా మారుతుంది. ఇక చేసేది ఏమి లేక మిగిలిపోయిన శీతల పానీయాలను పారేస్తుంటారు. కానీ.. పారబోయకుండా ఇంటి పనులకు ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

మరకలు తొలగించవచ్చు: సాధారణంగా దుస్తులపై పడిన మరకలను తొలగించడం కష్టమే. కొన్ని మరకలు ఈజీగా వదిలిపోతే.. మరికొన్నింటిని వదిలించడానికి కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా దుస్తులపై నూనె, గ్రీజ్​ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటి సమయాల్లో కూల్​డ్రింక్​ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం మరక పడిన ప్రదేశంలో కూల్​ డ్రింక్​ పోసి ఓ 30 నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత దుస్తులను వాష్​ చేస్తే మరకలు ఈజీగా పోతాయని అంటున్నారు.

టాయిలెట్ సీటు క్లీనింగ్​: సాధారణంగా టాయిలెట్ సీటుపై మరకలు తొందరగా ఏర్పుడుతుంటాయి. ఇక వీటిని క్రమం తప్పకుండా క్లీన్​ చేస్తే తప్పించి శుభ్రం చేయకపోతే మరకలు మరింతగా ఏర్పడి ఓ పట్టాన వదలవు. అందుకే.. టాయిలెట్​ సీట్​ను క్లీన్​ చేయడానికి మార్కెట్లో లభించే క్లీనర్స్​ యూజ్​ చేస్తుంటారు. అయితే ఈసారి క్లీన్​ చేసేటప్పుడు మిగిలిపోయిన కూల్​డ్రింక్​ను యూజ్​ చేయమంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఓ స్ప్రే బాటిల్‌లో శీతల పానీయాన్ని నింపి టాయిలెట్​ సీట్​పై స్ప్రే చేయాలి. ఓ 10 నుంచి 15 నిమిషాల తర్వాత బ్రష్‌తో క్లీన్​ చేసి ఫ్లష్ చేస్తే.. టాయిలెట్ సీటుకు కొత్తదానిలా కనిపిస్తుందని అంటున్నారు.

తుప్పు వదలగొట్టడానికి: ఇనుప వస్తువులు తొందరగా తుప్పు పడుతుంటాయి. ఈ తుప్పును వదిలించాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తుప్పు పట్టిన ప్రదేశంలో కూల్​ డ్రింక్‌ని చల్లి.. కాసేపటి తరవాత రుద్దితే.. మరకలు ఇట్టే పోతాయని అంటున్నారు.

ఫ్లోర్​ క్లీనింగ్​: కొన్నిసార్లు సిమెంట్ ఫ్లోర్ లేదా టైల్స్‌పై నూనె లేదా గ్రీజు మరకలు ఏర్పడతాయి. వీటిని తుడిచినా జిడ్డు మరకలు అనేవి తొందరగా పోవు. అలాంటి సమయంలో వాటిమీద కూల్ డ్రింక్స్ స్ప్రే చేసి కొద్దిసేపటి తర్వాత ఓ వస్త్రంతో తుడిస్తే.. జిడ్డు మరకలు పోవడంతో పాటు నేల తళతళలాడుతూ మెరుస్తుందని అంటున్నారు.

అద్దాలను మెరిపించవచ్చు: సాధారణంగా మనం ఇళ్లలో ఉపయోగించే అద్దాలపై దుమ్ము, ధూళి పేరుకుపోతుంటాయి. వీటిని ఎంత క్లీన్​ చేసినా అద్దం మాత్రం స్పష్టంగా కనిపించదు. అటువంటప్పుడు ఆ అద్దాలపై కొద్దిగా కూల్​డ్రింక్​ను స్ప్రే చేసి ఓ 5 నిమిషాల తర్వాత తడి క్లాత్,​ ఆపై పొడి క్లాత్​తో తుడిస్తే అద్దాలు మెరిసిపోతాయని అంటున్నారు. కారు విండ్​షీల్డ్​ క్లీనింగ్​కు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ట్యాప్స్​: కిచెన్​, బాత్​రూమ్​లో యూజ్​ చేసే ట్యాప్స్​పై నీళ్లు, సబ్బు నీళ్లు పడి మరకలు పడుతుంటాయి. దీంతో ఇవి అంత మంచిగా కనిపించవు. ఇక వీటిని క్లీన్​ చేయడానికి చాలా మంది బయట లభించే క్లీనర్స్​ ఉపయోగిస్తుంటారు. అయితే వాటి బదులు కూల్​డ్రింక్స్​ను యూజ్​ చేయమంటున్నారు నిపుణులు. అందుకోసం కూల్​డ్రింక్స్​ను ట్యాప్స్​ మీద స్ప్రే చేసి కొద్దిసేపటి తర్వాత క్లీన్​ చేస్తే మరకలు పోయి మెరుస్తాయని అంటున్నారు.

మాడిన గిన్నెలు: వంట చేసే క్రమంలో కొన్నిసార్లు గిన్నెలు మాడుతుంటాయి. ఇక వాటిని రుద్దాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. ఇలాంటి సమయంలో మాడిన గిన్నెలో కూల్​డ్రింక్స్​ పోసి రాత్రి మొత్తం అలానే ఉంచి.. మరుసటి రోజు ఉదయం వాటిని క్లీన్​ చేస్తే మాడిన మరకలు మొత్తం పోతాయని అంటున్నారు.

బబుల్​గమ్​ అతుక్కుంటే: మనం నడుస్తున్నప్పుడు షూస్​ లేదా చెప్పులకు బబుల్​గమ్​ అంటుకుంటుంది. ఇక దానిని తొలగించాలంటో కొద్దిగా కష్టమే. అలాంటప్పుడు బబుల్​గమ్​ అంటుకున్న ప్రదేశంలో కూల్​డ్రింక్స్​ పోసి కొద్దిసేపటి తర్వాత తీస్తే ఈజీగా ఉడిపోతాయంటున్నారు.

Note: నిపుణులు, సోషల్​ మీడియాలోని సమాచారం ప్రకారం వీటిని అందిస్తున్నాము. కూల్​డ్రింక్స్​తో వీటిని క్లీన్​ చేయాలా వద్దా అనేది మీ వ్యక్తిగతం.

కిచెన్ క్లీనింగ్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? - ఇలా చేశారంటే ఎప్పుడూ తళతళా మెరుస్తుంది!

డోర్ మ్యాట్స్ ఇలా క్లీన్ చేయండి - ఎంతటి మురికివైనా నిమిషాల్లో కొత్తవాటిలా మారుతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.