Best Washing Tips for Door Mats :ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకోసమే తరచూ శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు వస్తువుల దుమ్ము దులపడం.. ఇలాంటివెన్నో చేస్తుంటాం. కానీ, కొన్ని రకాల వస్తువుల క్లీనింగ్విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. అలాంటి వాటిల్లో ఒకటి.. డోర్ మ్యాట్స్. కొంతమంది ఇంట్లోకి స్వాగతం పలికే ఈ మ్యాట్స్ని క్లీన్ చేయకుండా రోజుల తరబడి యూజ్ చేస్తుంటారు. అయితే, డోర్ మ్యాట్స్ని శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు అలాగే వాడడం వల్ల వాటిపై దుమ్ము-ధూళి చేరి మురికిగా కనిపిస్తుంటాయి.
పైగా అలాంటి వాటి వల్ల శ్వాసకోశ, చర్మ సంబంధిత అలర్జీలు వంటి పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, తరచుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం మాత్రమే కాదు.. డోర్ మ్యాట్స్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే, చాలా మంది వీటిని వాష్ చేయడం కష్టంతో కూడుకున్న పనిగా భావిస్తుంటారు. అలాంటి వారికోసమే కొన్ని సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో డోర్ మ్యాట్స్ మురికిని వదలగొట్టి కొత్తవాటిలా మెరిపించవచ్చంటున్నారు! ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేడి నీటితో ఇలా చేయండి :డోర్ మ్యాట్స్ క్లీనింగ్ విషయంలో ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక వెడల్పాటి బకెట్లో తగినన్ని వేడి నీటిని తీసుకోవాలి. ఆపై మీరు శుభ్రం చేయాలనుకుంటున్న మ్యాట్స్ను అందులో అవి మునిగేలా వేసి అరగంటపాటు నాననివ్వాలి. అనంతరం మరో బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని నానబెట్టుకున్న వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాటిలో ఉండే సగం దుమ్ము, ధూళి తొలగిపోతాయి. తక్కువ దుమ్ము ఉన్నవైతే ఒక్కసారికే శుభ్రంగా క్లీన్ అవుతాయి. మురికి ఎక్కువగా ఉన్నట్లయితే ఈవిధంగా చేస్తే మొత్తం మురికి వదిలి కొత్తవాటిలా మెరుస్తాయంటున్నారు.