తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బెస్ట్​ టీ టైమ్​ స్నాక్​ "సేమియా పకోడి" - ఇలా చేస్తే క్రిస్పీ అండ్​ టేస్టీ! - HOW TO MAKE SEMIYA PAKODA AT HOME

-ఉల్లిపాయ పకోడిని మించిన టేస్ట్​ -పిల్లలకు ఎంతో నచ్చుతుంది

How to Make Semiya Pakoda at Home
How to Make Semiya Pakoda at Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 10:51 AM IST

How to Make Semiya Pakoda at Home:ఈవెనింగ్​ టైంలో క్రంచిగా ఏదో ఒక స్నాక్​ తినాలనిపిస్తుంది. అటువంటి సమయంలో అందరూ తేలికగా చేసుకునేది ఉల్లిపాయ పకోడి. అది కాదంటే.. ఆలూ బజ్జీ, పాలకూర పకోడి వంటివి చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడూ అదే కాకుండా వెరైటీగా చేసుకోవాలనుకునేవారు ఓసారి సేమియా పకోడి ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. ఆయిల్​ ఫుడ్​ అని భయపడేవారే.. మరో రెండు ఎక్స్​ట్రా లాగిస్తారు. టేస్ట్​ అంతబాగుంటుంది. చెబితేనే నోరూరుతోందా.. అయితే ఓసారి మీరూ ట్రై చేయండి. మరి వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • సేమియా - ఒకటిన్నర కప్పులు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2
  • జీలకర్ర - 1 టేబుల్​ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీస్పూన్​
  • పసుపు - చిటికెడు
  • కరివేపాకు -2 రెమ్మలు
  • కారం - 1 టీస్పూన్​
  • శనగపిండి - కప్పున్నర
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • చాట్​ మసాలా - 1 టీ స్పూన్​
  • బేకింగ్​ సోడా - చిటికెడు

సేమియా పకోడి తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సేమియా, కొద్దిగా ఉప్పు వేసుకుని ఓ 50 శాతం ఉడికించుకోవాలి.
  • సేమియా ఉడికిన తర్వాత జల్లెడలో వేసుకుని చల్లటి నీళ్లు పోసి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​లోకి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, పసుపు, కారం, కొత్తిమీర తరుగు, చాట్​ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, శనగపిండి వేసి ఉల్లిపాయ ముక్కలను పిండుతూ కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి ఉడికించిన సేమియా వేసి మరీ బలంగా కాకుండా కేవలం చేతి వేళ్ల సాయంతో కలుపుకోవాలి. ఇలా చేస్తే సేమియా విరగకుండా ఉంటుంది. ఇక చివరకు బేకింగ్​ సోడా వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద కడాయి పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి.
  • నూనె హీటెక్కిన తర్వాత స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో పెట్టి సేమియా మిశ్రమాన్ని పకోడిలా మాదిరిగా వేసుకోవాలి.
  • మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచే పకోడిలను ఎర్రగా కాల్చుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సేమియా పకోడి రెడీ.
  • దీన్ని నిమ్మకాయ కారం లేదా టమాట సాస్​తో కలిపి తింటే ఉండే మజానే వేరు. మరి మీరూ ఓ సారి ట్రై చేస్తారా?

గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి

సేమియా ఉప్మా ముద్ద ముద్దగా అవుతోందా? - ఇలా చేస్తే పొడిపొడిగా చాలా రుచికరంగా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details